ఉత్కంఠభరితంగా హాకీ టోర్నీ

ABN , First Publish Date - 2022-01-26T06:11:45+05:30 IST

ఎలమంచిలి రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో జరుగుతున్న 12 వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ హాకీ టోర్నమెంటులో విశాఖ, నెల్లూరు జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం క్వార్టర్‌ ఫైనల్‌, సెమీఫైనల్‌ పోటీలు రసవత్తరంగా సాగాయి.

ఉత్కంఠభరితంగా హాకీ టోర్నీ
విశాఖ-చిత్తూరు జట్ల మధ్య హోరాహోరీ పోరు

ఫైనల్స్‌ చేరిన విశాఖ, నెల్లూరు జట్లు


ఎలమంచిలి, జనవరి 25: ఎలమంచిలి రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో జరుగుతున్న 12 వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ హాకీ టోర్నమెంటులో విశాఖ, నెల్లూరు జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం క్వార్టర్‌ ఫైనల్‌, సెమీఫైనల్‌ పోటీలు రసవత్తరంగా సాగాయి. 13 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొన్నారు. బుధవారం ఫైనల్స్‌లో విశాఖ, నెల్లూరు జట్లు తలపడతాయి. అలాగే 3, 4 స్థానాలకు కూడా పోటీలు జరుగనున్నాయి. మంగళవారం జరిగిన మొదటి సెమీఫైనల్‌లో అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య జరిగిన పోటీ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఇరు జట్లు నిర్ణీత సమయంలో గోల్స్‌ చేయకపోవడంతో అంపైర్‌ షూట్‌ అవుట్‌లు ఇవ్వడంతో నెల్లూరు-3, అనంతపూర్‌-2 గోల్‌ చేయగా నెల్లూరు విజయం సాధించింది. రెండో సెమీఫైనల్‌లో విశాఖ, చిత్తూరుపై 4-1 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. క్రీడాకారులను వైహెచ్‌ఏ ప్రెసిడెంట్‌ జీవీ రెడ్డి, సీనియర్‌ క్రీడాకారులు దాసరి మహేశ్‌, రాంబాబు, రమేశ్‌ తదితరులు పరిచయం చేసుకున్నారు. బుధవారం ఉదయం జరుగనున్న ఫైనల్‌ పోటీ కోసం మరిన్ని ఏర్పాట్లు చేసినట్టు వైహెచ్‌ఏ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.

Updated Date - 2022-01-26T06:11:45+05:30 IST