ఉత్కంఠగా జాతీయస్థాయి ఎద్దుల బలప్రదర్శన పోటీలు

ABN , First Publish Date - 2022-01-19T05:49:23+05:30 IST

అన్నంబొట్లవారిపాలెంలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీ లు హోరాహోరీగా సాగుతున్నాయి. స్థానిక గో రంట్ల రత్తయ్యచౌదరి ప్రాంగణంలో మంగళవా రం 6 పళ్ల విభాగంలో మొదటగా హైదరాబాద్‌కు చెందిన డి.రోషన్‌బాబు ఎద్దులు నిర్ణీత స మయానికి 2101.5 అడుగల దూరం లాగాయి.

ఉత్కంఠగా జాతీయస్థాయి ఎద్దుల బలప్రదర్శన పోటీలు
గొట్టిపాటి ప్రాంగణంలో బండలాగుతున్న ఎద్దులు

 పర్చూరు, జనవరి 18 : అన్నంబొట్లవారిపాలెంలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీ లు హోరాహోరీగా సాగుతున్నాయి. స్థానిక గో రంట్ల రత్తయ్యచౌదరి ప్రాంగణంలో మంగళవా రం 6 పళ్ల విభాగంలో మొదటగా హైదరాబాద్‌కు చెందిన డి.రోషన్‌బాబు ఎద్దులు నిర్ణీత స మయానికి 2101.5 అడుగల దూరం లాగాయి. గుంటూరు జిల్లా కొత్తపాలేనికి చెందిన యామి నిమోహన్‌శ్రీ ఎద్దులు 5100 అడుగులు, పత్తిపా డు గ్రామానికి చెందిన పామిడి అంజియ్య ఎద్దు లు  5428.02, గుంటూరు జిల్లా ఇరుకువారిపాలేనికి చెందిన విజయలక్ష్మి బుల్స్‌ 4632.06 అడుగుల దూరం లాగాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా నిర్వాహకులు కొనకంచి సుబ్బారావు, మర్రి నాగేశ్వరరావు ఏర్పాట్లు చేశారు. 


సత్తాచాటిన గుంటూరు జిల్లా ఎద్దులు


 అన్నంబొట్లవారిపాలెంలో గొట్టిపాటి హనుమంతరావు ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీ యస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. సబ్‌జూనియర్స్‌ వి భాగంలో గుంటూరు జిల్లా ఎద్దులు సత్తా చాటి ప్రథమస్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన అ త్తోటి శిరీషచౌదరి ఎద్దులు 4,501 అడుగుల దూ రం లాగి విజేతగా నిలిచాయి. బేస్తవారపేటకు చెందిన వేగినాటి బసురామిరెడ్డి ఎద్దులు 4500 అడుగుల దూరం లాగి ద్వితీయస్థానం కైవసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కల్లూరి ప్రణతి ఎద్దులు 3,300 అడుగులతో మూడోస్థానం దక్కించుకున్నాయి.  పెద్దారవీడు గ్రామానికి చెందిన బండ్ల భరత్‌ ఎ ద్దులు 3,139 అడుగుల దూరంతో నాల్గో స్థానం లో నిలిచాయి. ఫ్లడ్‌లైట్లు, విద్యుత్‌ కాంతుల మ ధ్యపోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.  నిర్వాహకులు గోరంట్ల భాస్కరరావు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Updated Date - 2022-01-19T05:49:23+05:30 IST