నర్సీపట్నం కోర్టు వద్ద నినాదాలు చేస్తున్న న్యాయవాదులు
నర్సీపట్నం అర్బన్, జూన్ 29 : తూర్పు గోదావరి జిల్లాలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ నర్సీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సంద ర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 21న కాకినాడకు చెందిన న్యాయవాది కళా నాగేశ్వరరావుపై కక్షి దారులు దాడి చేయడాన్ని ఖండి స్తున్నట్టు చెప్పారు. న్యాయవాదులకు ప్రభు త్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు. కార్యదర్శి లోవరాజు పాల్గొన్నారు.