పల్లెప్రగతిని బహిష్కరిస్తాం: సర్పంచులు

ABN , First Publish Date - 2022-05-28T04:15:47+05:30 IST

గ్రామపంచాయతీ లలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లిం చాలని లేనిపక్షంలో జూన్‌3 నుంచి ప్రారంభ మయ్యే 5వవిడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని బహి ష్కరిస్తామని జిల్లాసర్పంచుల సంఘం నాయ కులు పేర్కొన్నారు. శుక్రవారం ఆదివాసీ భవనం లో సమావేశం అయిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

పల్లెప్రగతిని బహిష్కరిస్తాం: సర్పంచులు
నిరసన తెలుపుతున్న సర్పంచులు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 27: గ్రామపంచాయతీ లలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లిం చాలని లేనిపక్షంలో జూన్‌3 నుంచి ప్రారంభ మయ్యే 5వవిడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని బహి ష్కరిస్తామని జిల్లాసర్పంచుల సంఘం నాయ కులు పేర్కొన్నారు. శుక్రవారం ఆదివాసీ భవనం లో సమావేశం అయిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పం చుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గుణవం త్‌రావు మాట్లాడుతూ వచ్చేనెల 3నుంచి ప్రారంభం కానున్న 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాట వినని సర్పంచులను సస్పెండు చేయాలంటూ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసమన్నారు. మంత్రి తన వ్యాఖ్యాలను తక్ష ణమే వెనక్కు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే టీఆర్‌ఎస్‌ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేయడానికైనా సిద్ధ పడతాము కానీ బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. అనంతరం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్యే అత్రం సక్కుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా కార్యదర్శి సిడాం అన్నిగ, సర్పంచులు అత్రం దిన్‌కర్‌, బండె తుకారాం, బుర్స పోచమల్లు, మడావి  భీంరావు, మధుకర్‌, కనక జ్యోతిరాం, జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T04:15:47+05:30 IST