భూకబ్జాదారుల బరితెగింపు

ABN , First Publish Date - 2022-07-01T06:24:43+05:30 IST

అనకాపల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆక్రమణదారులు పట్టించుకోవడంలేదు.

భూకబ్జాదారుల బరితెగింపు
హెచ్చరిక బోర్డు పక్కనే ఇంటిని నిర్మిస్తున్న దృశ్యం

‘రెవెన్యూ’ హెచ్చరిక బోర్డు సాక్షిగా పక్కా ఇంటినిర్మాణం

అనకాపల్లి అర్బన్‌, జూన్‌ 30: అనకాపల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆక్రమణదారులు పట్టించుకోవడంలేదు. రెవెన్యూ సిబ్బంది వెళ్లిపోయిన వెంటనే బోర్డులను పీకేస్తున్నారు. మరికొన్నిచోట్ల హెచ్చరిక బోర్డుల సాక్షిగా ఇళ్లు నిర్మిస్తున్నారు. తాజాగా జీవీఎంసీ జోన్‌-7 పరిధిలోని సాలాపువానిపాలెం సర్వే నంబరు 93లో వున్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు దర్జాగా ఇంటిని నిర్మిస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును ఆనుకుని గోడ నిర్మించడం కబ్జాదారుల బరితెగింపునకు నిదర్శమని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.


Updated Date - 2022-07-01T06:24:43+05:30 IST