పకడ్బందీగా ‘దళితబంధు’అమలు

ABN , First Publish Date - 2022-01-23T04:34:33+05:30 IST

దళితబంధు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అ న్నారు.

పకడ్బందీగా ‘దళితబంధు’అమలు
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

- వీడియో కాన్ఫరెన్స్‌లో 

కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, జనవరి 22: దళితబంధు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అ న్నారు.  శనివారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో దళితబంధు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేర కు దళితబంధు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో  అభి వృద్ధి చేయాలని, ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో కనీసం 100మంది దళితులకు పఽథకాన్ని అమలు చేయాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గ్రౌండ్‌ లెవెల్‌లో లబ్ధిదారులను ఎంపిక చేసుకొని లక్ష్యం మేరకు లబ్ధి చేకూర్చాలన్నారు.  కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని త్వ రగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. దళిత కుటుంబాలలో ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచడానికి ప్రభుత్వం రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నందున, అందుకు తగిన పథకాలను రూపొందించి అమలు పరచాల్సిన బాధ్య త అధికారులపై ఉందన్నారు. ఫిబ్రవరి 5లోగా ప్రతీ నియోజక వర్గంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కా వాలని, మార్చి 7లోపు యూనిట్ల గ్రౌండ్‌ పూర్తి చే యాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ దళితబంధు అమలుపై జిల్లాలో రెండు నియోజకవర్గాల శాసనసభ్యులతో, జిల్లా అధికారులతో చర్చించి  కమిటీని ఏర్పాటు చేసి లబ్ధిదా రులను గుర్తిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 7లోగా లబ్ధిదారుల  ఎంపికను పూర్తిచేస్తామన్నారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, డీఆర్‌డీవో ఉమాదేవి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి శ్వేత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-23T04:34:33+05:30 IST