Exercise చేస్తున్నవారిపై దూసుకెళ్లిన వ్యాన్..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-10-28T14:35:08+05:30 IST

ఉట్నూరు మండలంలో వ్యాన్ బీభత్సం సృష్టించింది. గోదారిగూడ దగ్గర వ్యాయామం చేస్తున్నవారిపై వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..

Exercise చేస్తున్నవారిపై దూసుకెళ్లిన వ్యాన్..ఇద్దరు మృతి

ఆదిలాబాద్: ఉట్నూరు మండలంలో వ్యాన్ బీభత్సం సృష్టించింది. గోదారిగూడ దగ్గర వ్యాయామం చేస్తున్నవారిపై వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా..పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-28T14:35:08+05:30 IST