గంటల తరబడి కంప్యూటర్ల ముందు పని చేస్తున్నారా? అయితే..

ABN , First Publish Date - 2022-05-05T21:41:03+05:30 IST

గంటల తరబడి కంప్యూటర్ల ముందు పని చేస్తూ ఉంటాం. దీంతో కళ్లు అలసటకు గురవుతాయి, పొడి బారతాయి. ఇలాంటి అలసిన కళ్లు సేద తీరాలంటే రోజుకు

గంటల తరబడి కంప్యూటర్ల ముందు పని చేస్తున్నారా? అయితే..

ఆంధ్రజ్యోతి(05-05-2022)

గంటల తరబడి కంప్యూటర్ల ముందు పని చేస్తూ ఉంటాం. దీంతో కళ్లు అలసటకు గురవుతాయి, పొడి బారతాయి. ఇలాంటి అలసిన కళ్లు సేద తీరాలంటే రోజుకు ఒక్కసారైనా ఐ వర్కవుట్‌ సాధన చేస్తూ ఉండాలి. ఈ వ్యాయామంలో అనుసరించవలసిన దశలివే!


కనుగుడ్లను పైకి తిప్పి మూడు సెకండ్ల పాటు అలాగే ఉంచి, కిందకు దింపాలి. అలా మూడు సెకండ్ల పాటు కిందకు దింపి ఉంచాలి. ఇలా మొత్తం మూడు సార్లు చేయాలి.కనుగుడ్లను 3 సెకండ్ల పాటు కుడి వైపుకు తిప్పి ఉంచాలి. అలాగే ఎడమ వైపు కూడా తిప్పి ఉంచాలి. ఇలా మూడు సార్లు చేయాలి. కనుగుడ్లను పై వైపు, ఎడమ వైపుకు తిప్పి (టాప్‌ లెఫ్ట్‌), మూడు సెకండ్ల పాటు, పై వైపు కుడి వైపుకు తిప్పి (టాప్‌ రైట్‌) మూడు సెకండ్ల పాటు ఉంచాలి. 


ఇలా మూడు సార్లు చేయాలి. కనుగుడ్లను కుడివైపుకు గుండ్రంగా మూడు సార్లు, ఎడమ వైపుకు మూడుసార్లు తిప్పాలి. ఇలా మూడు సార్లు చేయాలి. రెండు కళ్లనూ గట్టిగా మూసి, పది సెకండ్ల పాటు అలాగే ఉండి, కళ్లు తెరవాలి.కళ్లను పెద్దవిగా తెరచి, పది సెకండ్ల పాటు అలాగే ఉంచాలి. అంతిమంగా కళ్లను వేగంగా ఆర్పి, తర్వాత రిలాక్స్‌ కావాలి. 


Read more