నగరంలో టీడీపీ బలోపేతానికి కసరత్తు

ABN , First Publish Date - 2021-09-15T05:23:03+05:30 IST

నగరంలో టీడీపీ బలోపేతానికి కసరత్తు

నగరంలో టీడీపీ బలోపేతానికి కసరత్తు

- త్వరలో పార్టీ నగర కమిటీ 

- అనుబంధ సంఘాల ఏర్పాటుపై దృష్టి 

(విజయనగరం రూరల్‌) 

జిల్లా కేంద్రం, విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని 50 డివిజన్‌లకు గాను, 45 డివిజన్లలో ఇప్పటికే  సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. మరో ఐదు డివిజన్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక్క కార్పొరేటర్‌ మాత్రమే గెలుపొందారు. 21 డివిజ న్లలో వైసీపీ రెబల్స్‌ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఈ స్థానాల్లో టీడీపీకి కలిసోస్తుం దని పార్టీ నేతలు విశ్లేషించినా...  మూడో స్థానానికి దిగిపోయింది. 2014 ఎన్నిక ల్లో టీడీపీ నుంచి 33 మంది కౌన్సిలర్లు విజయం సాధించారు. ఈ పరిస్థితు ల్లో విజయనగరం నియోజకవర్గంలో కీలకంగా ఉన్న నగరంలో టీడీపీ బలో పేతానికి పార్టీ చర్యలు ప్రారంభించింది.


నగర కమిటీపై కసరత్తు

టీడీపీ నగర కమిటీ ఏర్పాటుకు దాదాపు కసరత్తు పూర్తయింది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి, తద్వారా నగరంలో పార్టీ బలోపేతానికి ప్రణాళిక సిద్ధమైంది. నగర కమిటీ అధ్యక్ష పదవి రేసులో కాపు సామాజిక వర్గానికి చెందినవారికి ఇచ్చేందుకు పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అనుబంధ కమిటీల విషయానికి వస్తే నగర తెలుగు యువత పదవిని కాపు సామాజిక వర్గానికి, తెలుగు మహిళా అధ్యక్ష పదవిని వైశ్య సామాజిక వర్గానికి ఇచ్చే విధంగా కరసత్తు జరిగింది. మిగతా కార్యవర్గాల కూర్పులో కూడా అన్ని సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా పార్టీని ముందుకు నడిపించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు భావిస్తున్నట్టు సమాచారం.  

Updated Date - 2021-09-15T05:23:03+05:30 IST