
ఆంధ్రజ్యోతి(23-10-2021)
రోజూ కనీసం 40 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. ఒకవేళ వ్యాయామం చేయకపోతే ఏం జరుగుతుంది? అంటే.. ఇదిగో ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ వచ్చిపడతాయని అంటున్నారు.
వ్యాయామం కొరవడితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. గుండె పనితీరు నెమ్మదిస్తుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కండరాలు బలహీనపడతాయి. ఒంట్లో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. చురుకుదనం లోపిస్తుంది. సరైన నిద్ర పోలేరు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అంత త్వరగా నిద్రకు ఉపక్రమించలేరు. డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బరువు పెరుగుతారు. ఫలితంగా కీళ్ల నొప్పులు వచ్చిపడతాయి.