తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రి విస్తరణ

ABN , First Publish Date - 2022-05-22T05:08:31+05:30 IST

తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిని విస్తరించి, అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు హైదరాబాద్‌ ఆయుర్వేద ఆస్పత్రుల విభాగాధిపతులు పేర్కొన్నారు.

తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రి విస్తరణ
ఆయుర్వేద ఆస్పత్రిలో మున్సిపల్‌ చైర్మన్‌తో మాట్లాడుతున్న హైదరాబాద్‌ ఆయుర్వేద విభాగాల అధిపతులు

  24న మెగా వైద్య శిబిరం ఏర్పాటు

 ఆస్పత్రిని సందర్శించిన విభాగాల అధిపతులు


తూప్రాన్‌, మే 21: తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిని విస్తరించి, అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు హైదరాబాద్‌ ఆయుర్వేద ఆస్పత్రుల విభాగాధిపతులు పేర్కొన్నారు. శనివారం సర్జరీ విభాగం అధిపతి డాక్టర్‌ శ్రీధర్‌, గైనిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ సునీతా, పంచకర్మ విభాగం అధిపతి డాక్టర్‌ జోహార్‌, జనరల్‌ విభాగం అధిపతి డాక్టర్‌ లక్ష్మీకాంత్‌ తూప్రాన్‌ను ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆయూష్‌ కమిషనర్‌ అలుగు వర్షిణి తూప్రాన్‌ ఆయుర్వేద ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ఈ నెల 24న  వివిధ విభాగాలతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక చికిత్సలకు సంబంధించిన రోగులు క్యాంపునకు హాజరై సేవలు పొందాలన్నారు. ప్రధానంగా రాచపుండ్లు, పైల్స్‌, జనరల్‌ సర్జరీలు, గర్భిణులు, గైనిక్‌ సమస్యలు, పంచకర్మ, క్రానిక్‌ డిసీజె్‌సలకు చికిత్సలు అందజేస్తామన్నారు. క్యాంపు ఏర్పాటుపై మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌తో చర్చించారు. సుమారు 500 మంది రోగులు హాజరయ్యేలా చూడాలని కోరారు. 


 

Updated Date - 2022-05-22T05:08:31+05:30 IST