సోషల్ మీడియాలో హద్దులు దాటిన ప్రవాసీ అరెస్ట్!

ABN , First Publish Date - 2021-02-27T16:44:34+05:30 IST

గల్ఫ్‌లో నివాసముంటూ మతోన్మద రాజకీయాలు, అసభ్యకరమైన నిత్య సందేశాలతో ఫెస్‌బుక్‌లో అత్యంత క్రీయాశీకలంగా వ్యవహరించే హైదరాబాద్ నగరానికి చెందిన ఆబూ ఫైసల్ అనే ప్రవాసీయుడిని ఎట్టకేలకు నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో హద్దులు దాటిన ప్రవాసీ అరెస్ట్!

అభ్యంతకర పోస్టులతో నిరంతరం హల్‌చల్, సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్‌లో నివాసముంటూ మతోన్మద రాజకీయాలు, అసభ్యకరమైన నిత్య సందేశాలతో ఫెస్‌బుక్‌లో అత్యంత క్రీయాశీకలంగా వ్యవహరించే హైదరాబాద్ నగరానికి చెందిన ఆబూ ఫైసల్ అనే ప్రవాసీయుడిని ఎట్టకేలకు నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ​బహ్రెయిన్‌లో పని చేసే హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన ఆబూ ఫైసల్ నిరంతరం హిందుత్వ నాయకులకు వ్యతిరేకంగా అసభ్యకరమైన సందేశాలు పెడుతూ, బూతులు తిడుతూ సోషల్ మీడియాలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇతనికి అటు పాతబస్తీతో పాటు గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రవాసీయులు భారీ సంఖ్యలో ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఫైసల్ బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్‌కు వ్యతిరేకంగా చేసే బూతు పురాణాలకు పెట్టింది పేరు.


మజ్లీస్ పార్టీ వీరాభిమాని అయిన ఆబూ ఫైసల్‌కు బహ్రెయిన్‌తో పాటు కువైత్‌లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. అలాగే అటు హైదరాబాద్ నుండి మొదలు ఇటు దుబాయి వరకు అతనికి పెద్ద ఎత్తున మతోన్మాద అభిమానులు ఉన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర, మతోన్మాద వ్యాఖ్యలతో హల్‌చల్ చేసే ఇతనిపై హైద్రాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పోలీసులు ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఫైసల్ వ్యవహారం రోజురోజుకు శృతిమించడంతో సైబర్ క్రైం పోలీసులు గతేడాది లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ​ఏమిరేట్స్ విమానంలో మనమా నుండి దుబాయి మీదుగా హైదరాబాద్ వెళ్లిన ఫైసల్‌ను శంషాబాద్ విమానశ్రాయంలో లుక్ ఔట్ నోటీస్ ఆధారంగా శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


​కాగా, ఇటీవలి కాలంలో గల్ఫ్ నుండి ఫెస్ బుక్ పోస్టింగులపై అరెస్టయిన రెండో తెలంగాణ ప్రవాసీ ఆబూ ఫైసల్. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసత్య ఆరోపణలతో వీడియోను పోస్టు చేసిన దుబాయిలో పని చేసే జగిత్యాల జిల్లాకు చెందిన పన్యాల రాజును ముంబైలో అరెస్ట్ చేయగా బీజేపీ నాయకుల సహాయంతో బెయిల్ పొంది విడుదలయ్యాడు. అంతకుముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రవాసీ కూడా ఇలాంటి వ్యవహారంతోనే సౌదీలో రెండెళ్ళ జైలు శిక్ష అనుభవించి తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. అతని వల్ల అక్కడ కొందరు ఉద్యోగాలు కూడా కోల్పోయారు.     

Updated Date - 2021-02-27T16:44:34+05:30 IST