10లక్షలకు పైగా ప్రవాస కార్మికులు సౌదీకి గుడ్‌బై.. కారణమిదే!

ABN , First Publish Date - 2022-01-20T14:56:15+05:30 IST

2018లో సౌదీ అరేబియా తీసుకువచ్చిన ప్రవాస రుసుము విధానం ఆ దేశంలోని లేబర్ మార్కెట్‌కు కోలుకోని దెబ్బ కొట్టింది.

10లక్షలకు పైగా ప్రవాస కార్మికులు సౌదీకి గుడ్‌బై.. కారణమిదే!

రియాద్: 2018లో సౌదీ అరేబియా తీసుకువచ్చిన ప్రవాస రుసుము విధానం ఆ దేశంలోని లేబర్ మార్కెట్‌కు కోలుకోని దెబ్బ కొట్టింది. ప్రతియేటా పెరుగుతున్న ఈ ఫీజు కారణంగా భారీ సంఖ్యలో విదేశీ కార్మికులు సౌదీ వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా 2018 నుంచి 2021 మూడో త్రైమాసికం వరకు అంటే.. సుమారు 45 నెలల్లో ఏకంగా 10లక్షలకు పైగా ప్రవాస కార్మికులు సౌదీకి గుడ్‌బై చెప్పారు. ఇది ఆ దేశంలోని మొత్తం విదేశీ కార్మికుల్లో 10.12 శాతానికి సమానం. 


ఇక 2018లో సౌదీ అరేబియా మొదట ప్రవాస రుసుమును ఒక్క ఉద్యోగికి ఒక నెలకు 400 సౌదీ రియాళ్లుగా(రూ.7,935) నిర్ణయించింది. 2018 నుంచి 2019కి వచ్చేసరికి ఈ ఫీజు 600 సౌదీ రియాళ్లకు(రూ.11,902) చేరింది. అదే 2020లో 800 సౌదీ రియాళ్లు(రూ.15,870) అయింది. ఇలా ప్రతి ఏడాదికి ప్రవాస రుసుము భారీగా పెరుగుతుండడంతో విదేశీ కార్మికులు ఈ గల్ఫ్ దేశం నుంచి భారీగా వెనక్కి వెళ్లిపోతున్నారు. కాగా, ప్రవాస రుసుము విధానం అమల్లోకి రాకముందు 2017లో సుమారు 10.42 మిలియన్లుగా విదేశీ కార్మికుల సంఖ్య 2021 మూడో త్రైమాసికం నాటికి 9.36 మిలియన్లకు చేరింది. అదే సమయంలో సౌదీ అరేబియాలో పురుష, స్త్రీ కార్మికుల సంఖ్య 5.66 శాతం పెరిగింది. 

Updated Date - 2022-01-20T14:56:15+05:30 IST