ప్రవాసులకు Saudi Arabia తీపి కబురు.. ఇకపై ఆ రూల్ పాటించాల్సిన అవసరం లేదు!

ABN , First Publish Date - 2022-06-19T15:14:08+05:30 IST

గల్ఫ్ దేశం సౌదీ అరేబియా(Saudi Arabia) ప్రవాసులకు తీపి కబురు చెప్పింది.

ప్రవాసులకు Saudi Arabia తీపి కబురు.. ఇకపై ఆ రూల్ పాటించాల్సిన అవసరం లేదు!

రియాద్: గల్ఫ్ దేశం సౌదీ అరేబియా(Saudi Arabia) ప్రవాసులకు తీపి కబురు చెప్పింది. ఇకపై ప్రవాసులు(Expats) కరోనా వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా కింగ్‌డమ్‌కు రావచ్చు, వెళ్లొచ్చని సౌదీ వెల్లడించింది. అంటే.. ఎంట్రీ, ఎగ్జిట్(Exit) సమయంలో ప్రవాసుల వ్యాక్సినేషన్ స్టేటస్‌తో పనిలేదు. గత వారం సౌదీ అరేబియా మహమ్మారి కోవిడ్-19 సంబంధించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలు, ఆంక్షలను ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా ప్రవాసులకు వ్యాక్సినేషన్‌తో(Vaccination) సంబంధం లేకుండా ఆ దేశంలోకి ప్రవేశించే, అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లే వెసులుబాటు కల్పించింది. ఇక కింగ్‌డమ్ నుంచి వేరే దేశాలకు వెళ్లే ప్రవాసులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్(Passport), వీసా కలిగి ఉండాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ తెలిపింది. 


అలాగే వేరే దేశాల నుంచి సౌదీ వచ్చేవారు ఎంట్రీ(Entry) నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. "ప్రవాసులు కోవిడ్-19 టీకాలు తీసుకోవల్సిన అవసరం లేకుండానే సౌదీ అరేబియాకు రావచ్చు. అయితే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వీసాలు(Visas), రెసిడెన్సీ ధృవపత్రాలు కలిగి ఉండాలి" అని డైరెక్టరేట్ తన ప్రకటనలో పేర్కొంది. ఇక గత వారం తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లు ధరించడం, బహిరంగ కార్యక్రమాలు, ప్రజా రవాణా, విమానాలలోకి ప్రవేశించడానికి టీకాలు వేసుకోవాల్సిన అవసరం లేదనే అన్ని ఆంక్షలను సౌదీ ఎత్తివేసింది. ఇదిలాఉంటే.. సౌదీలో భారీ సంఖ్యలో ప్రవాసులు ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో సుమారు 3.48కోట్ల మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. భారత్ నుంచి సుమారు 30 లక్షల మంది సౌదీలో ఉన్నారు.  

Updated Date - 2022-06-19T15:14:08+05:30 IST