నిధుల కోసం ఎదురుచూపులు!

ABN , First Publish Date - 2022-04-29T05:23:36+05:30 IST

గ్రామీణ ఉపాధి హామీ పథకం కిం ద జిల్లావ్యాప్తం గా చేపట్టిన సీసీ రోడ్ల పనులు చేసిన సర్పంచ్‌లకు బి ల్లులు చెల్లించలేదు. ఆ గమేఘాల మీద పను లు పూర్తి చేయించినప్పటికీ నెలరోజుల నుం చి బిల్లులు అందడం లేదు. కలెక్టర్‌తో పాటు ఇటు ఉపాఽధి హామీ, అటు పంచాయతీ రాజ్‌ అధికారులు మార్చి 31 లోగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాల పనులను పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అడిషనల్‌ కలెక్ట ర్‌ హేమంత్‌ బోర్కడేలు పల్లెల్లో సుడిగాలి పర్యటనలు చేసి సీసీ రోడ్లను మార్చి 31లోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్పంచ్‌లు ఆగమేఘాల మీద అప్పులు చేసి సీసీ రోడ్ల పనులను పూర్తి చేశారు.

నిధుల కోసం ఎదురుచూపులు!
నర్సాపూర్‌ (జి)లో చేపడుతున్న సీసీ రోడ్ల పనులు ( ఫైల్‌)

నెల రోజులైనా విడుదల కాని సీసీ రోడ్ల బిల్లులు  

జిల్లాలో పేరుకుపోయిన రూ.38 కోట్లు

రూ.10 కోట్ల బిల్లులకు అనుమతి నిరాకరణ  

గడువు లేక మరలిపోయిన రూ.18 కోట్లు 

నిర్మల్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఉపాధి హామీ పథకం కిం ద జిల్లావ్యాప్తం గా చేపట్టిన సీసీ రోడ్ల పనులు చేసిన సర్పంచ్‌లకు బి ల్లులు చెల్లించలేదు. ఆ గమేఘాల మీద పను లు పూర్తి చేయించినప్పటికీ నెలరోజుల నుం చి బిల్లులు అందడం లేదు. కలెక్టర్‌తో పాటు ఇటు ఉపాఽధి హామీ, అటు పంచాయతీ రాజ్‌ అధికారులు మార్చి 31 లోగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాల పనులను పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అడిషనల్‌ కలెక్ట ర్‌ హేమంత్‌ బోర్కడేలు పల్లెల్లో సుడిగాలి పర్యటనలు చేసి సీసీ రోడ్లను మార్చి 31లోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్పంచ్‌లు ఆగమేఘాల మీద అప్పులు చేసి సీసీ రోడ్ల పనులను పూర్తి చేశారు. 

జిల్లావ్యాప్తంగా 1100 సీసీ రోడ్లు

జిల్లావ్యాప్తంగా మొత్తం 1100 సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకం కింద పూర్తి చేశారు. అధికారుల ఒత్తిడి, టార్గెట్‌ సాధన కోసం సర్పంచ్‌లు సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతలో రాజీ లేకుండా పూర్తి చేశారు. నెల రోజులు గడుస్తున్నా బిల్లులు విడుదల కాలేదు. దీంతో అప్పులు చేసి పనులు పూర్తి చేసిన సర్పంచ్‌లు అధికారుల చు ట్టూ తిరుగుతున్నారు. మొత్తం 1100 పనులకు సంబంధించి రూ.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. పంచాయతీ రాజ్‌ అధికారులు రూ.38 కోట్ల పనుల బిల్లులను ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వ రకు విడుదల కాకపోవడంతో సర్పంచ్‌లంతా లబోదిబోమంటున్నారు. మరో రూ. 10 కోట్ల బిల్లులను ప్రభుత్వానికి పంపించగా, వెనక్కి పంపించింది. జిల్లాలో రూ. 67 కోట్లతో సీసీ రోడ్ల పనులను చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు రూ పొందించారు. గడువు తక్కువగా ఉండడంతో రూ.48 కోట్లకు పనులను కుదించారు. పనులపై అధికారులు హడావిడి చేసినప్పటికీ బిల్లుల చెల్లింపులో ప ట్టించుకోవడం లేదంటున్నారు. గ్రాంట్‌ విడుదలకాకపోవడంతోనే బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నా నిధుల కొరతతోనే నిలిచిపోయాయన్న అభిప్రాయాలున్నాయి.

తెరపైకి ఎన్‌ఐసీ ఆన్‌లైన్‌ విధానం..  

కొద్దిరోజుల నుంచి ఈజీఎస్‌ పనుల్లో పారదర్శకతతో పాటు అవకతవకలను అరికట్టేందుకు ఎన్‌ఐసీ ఆన్‌లైన్‌ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విధానంతో అవకతవకలకు ఆస్కారం లేకుండా పోయిందని చెబుతున్నా రు. సీసీ రోడ్ల విషయంలో ఎన్‌ఐసీ యాఫ్‌లో పనుల వివరాలను అప్‌లో డ్‌ చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయకపోవడంతో సర్పంచ్‌లు బిల్లుల కోసం మానసిక వేధనకు లోనవుతున్నారు. 

బిల్లుల కోసం సర్పంచ్‌ల హైరానా

ఉపాధి హామీ పథకం కింద మెటిరియల్‌ కాంపోనెంట్‌ పేరిట జిల్లా వ్యాప్తంగా 1100 సీసీ రోడ్ల పనులను పూర్తి చేశారు. నిధులు ఉపాధి హా మీ ద్వారా మంజూరైనప్పటికీ సీసీ రోడ్ల పనుల బాఽధ్యతలను పంచా యతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. మార్చి 31లోగా నిర్మాణాల పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఇ టు సర్పంచ్‌లు, అటు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నిధు లు లేకున్నప్పటికీ సర్పంచ్‌లు అప్పులు చేసి పనులను గడువులో గా పూర్తి చేశారు. నెల రోజులు గడుస్తున్నా ఆ బిల్లుల ఊసే కనిపించడం లేదని చెబుతున్నారు. మొత్తం రూ.48 కోట్ల బిల్లులను సర్పంచ్‌లకు చెల్లించాల్సి ఉంది. పంచాయతీ రాజ్‌ శాఖ అధికారు లు మొదట రూ.38 కోట్లకు సంబంధించిన బిల్లులను చెల్లించాలం టూ సర్కారుకు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలు బుట్ట దాఖలు గా మారాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో బిల్లుల చెల్లింపు జరగడం లేదు. 

వెనక్కి వెళ్లిన రూ.18 కోట్లు.. 

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాం  తాల్లో రూ.67 కోట్ల వి లువైన మెటీరియల్‌ కాంపోనెంట్‌ పను లు చేపట్టేందుకు ని ర్ణయించారు. అ నుమతులు ఆలస్యం గా రావడంతో పను లు చేపట్టేందుకు గడు వు తక్కువైంది. దీంతో అ ధికారులు రూ.48 కోట్ల పనులకే అనుమతులు జారీ చేసి ప నుల బాఽధ్యతను పంచాయతీ రాజ్‌కు అ ప్పగించారు. మార్చి 31లోగా పనులను పూర్తి చేయాల్సి ఉండడంతో ఆ లోగా ఇంత పెద్దమొత్తంలో పనులు చేయడం అసాధ్యంకాదన్న భావనతోనే నిధులను కుదించారు. మొత్తం రూ. 67 కోట్ల ప్రతిపాదనలకు రూ. 48 కోట్ల పనులను చేపట్టడంతో మరో రూ. 18 కోట్లు వెనక్కి మరలిపోయాయి. గడువు తక్కువగా ఉన్న కారణంగానే అధికారులు మొత్తం పనులను చేపట్టలేమన్న కారణంగా కుదించారు. ప్రభుత్వం నుంచి చివరి దశలో అనుమతులు లభించడంతోనే నిధులు మరలిపోయాయంటున్నారు.

Updated Date - 2022-04-29T05:23:36+05:30 IST