కోవాగ్జిన కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-05-09T05:00:37+05:30 IST

కరోనా నివారణకు వ్యాక్సినేషనే మార్గ మంటున్న అధికారులు వ్యాక్సిన తెప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి.

కోవాగ్జిన కోసం ఎదురుచూపులు
అర్బన హెల్త్‌ సెంటరు వద్ద క్యూ కట్టిన ప్రజలు

నాలుగు వారాలు దాటిన వారు వెయ్యిమంది

150 మందికే సెకండ్‌డోస్‌

సమయం మీరితే మొదటి డోస్‌ వృఽథా

ఎక్కువ మోతాదులో తెప్పించాలి

బద్వేలు రూరల్‌, మే 8: కరోనా నివారణకు వ్యాక్సినేషనే మార్గ మంటున్న అధికారులు వ్యాక్సిన తెప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. స్థానిక కోటవీ ధి అర్బన హెల్త్‌ సెంటరు పరిధి లో కోవాగ్జిన మొదటి డోస్‌ వేయించుకున్న వారు దాదాపు వెయ్యి మంది ఉన్నా శనివారం 150 డోస్‌ల వ్యాక్సిన మాత్రమే వ చ్చింది.

దీంతో రెండో డోస్‌ కోసం ప్రజలు వందల సంఖ్యలో బారులు తీరారు. ఈ విషయాన్ని వివరంగా చెప్పి ఇంటికి పం పించాల్సిన మండల వైద్యఆరోగ్య శాఖ అధి కారులు మౌనం వహించడంతో మధ్యాహ్నం వరకు ఎండలో నిల్చున్న అనేక మంది ఉసు రోమంటూ నిట్టూరూస్తూ ఇళ్లకు వెళ్లిపోయా రు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక కోటవీధి అర్బన హెల్త్‌ సెంటరులో కోవాగ్జిన కొరత ఏర్పడింది. ఈ కేంద్రంలో మొదటి డోస్‌ పూర్తి చేసుకున్న వారు దాదాపు వెయ్యిమంది పైబడి ఉన్నారు.

ఈ నెల 1వ తారీఖునే వారి కి మొదటి డోస్‌ వేయించుకున్న సమయం పూర్తి కావడంతో వారం రోజులుగా వ్యాక్సిన కోసం ఎదురు చూస్తున్నా రు. ఎట్టకేలకు శనివారం అర్బన హె ల్త్‌ సెంటరుకు  కోవాగ్జిన వచ్చినా కేవలం 150 మందికి మాత్రమే సరి పడా వ్యాక్సిన చేరింది. విషయం తెలియని ప్రజలు వందల సంఖ్యలో వ్యాక్సిన కేంద్రం వద్ద క్యూ కట్టారు.

దాదాపు నాలుగు గంటలు నిలబడి నా 150 మందికి మాత్రమే వ్యాక్సిన అందింది. మొదటి డోస్‌ సమయం మీరితే వ్యాక్సిన వేయించుకున్నా వృథా అవు తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెకండ్‌డోస్‌కు సరిపడా వ్యాక్సినను సంబంఽధి త వైద్యశాఖ ఉన్నతాధికారులు పంపాలం టూ మొదటి డోస్‌ వేయించుకున్న వారంద రూ కోరుతున్నారు.

Updated Date - 2021-05-09T05:00:37+05:30 IST