ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-10-04T04:42:24+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.

ఎదురుచూపులు
గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమాధికారి కార్యాలయం

బీసీ రుణాల కోసం నిరుద్యోగుల పడిగాపులు

ఏళ్ల తరబడి నిరీక్షణ 

11,526 దరఖాస్తులు పెండింగ్‌


గద్వాల క్రైం, అక్టోబరు 3: జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. జిల్లా నుంచి 2014-15 సంవత్స రంలో కేటగిరీ 1, 2, 3లలో 4,403 మంది, 2018-19లో 8,050 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు సంవత్సరాలకు సంబంధించి కేటగిరీ 1కు సంబంధించి 927 మందికి రూ.లక్ష చొప్పున రుణాలు వచ్చాయని, వాటిలో సబ్సిడీ కింద రూ.50 వేలు నగదును అందించామని జిల్లా ఇన్‌చార్జి బీసీ సంక్షేమ అధికారి కేశవులు  తెలిపారు. ఇంకా కేటగిరీ 1 లోనే చాలామందికి రుణాలు రావాల్సి ఉంది. కేటగిరీ 1లో లక్ష వరకు, కేటగిరీ 2లో రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు, కేటగిరీ మూడులో మూడు నుంచి 12 లక్షల వరకు రుణాలు ఇస్తారు.


ఏడేళ్లుగా నిరీక్షణ

రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నామని దరఖాస్తుదారులు అంటున్నారు. గతంలో కొన్ని సందర్భాలలో ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఆపేశామని చెప్పారని, ఇప్పుడు ఎలాంటి ఏన్నికలు లేకునాన రుణాల మంజూరులో జాప్యం ఎదుకు చేస్తున్నారో తెలియడం లేదని వాపోతున్నారు.


రుణాల కోసం నాలుగు సంవత్సరాల క్రితం

రుణం మంజూరైతే ఏదైనా వ్యాపారం చేద్దామని నాలుగేళ్ల కిందట దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు ప్రభుత్వం రుణాల ఊసెత్తడం లేదు. రుణం ఎప్పుడు మంజూరవుతుందో.. మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయో తెలియడం లేదు.

- సురేందర్‌, గద్వాల

ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్‌ లేవు

జిల్లాలో 12,453 మంది వివిధ కేటగిరీల కింద బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 927 మందికి రుణాలు మంజూరయ్యాయి. 11,526 దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్‌ లేనందున నిలిపేశారు. గైడ్‌లైన్స్‌ వచ్చాక కేటగిరీల ఆధారంగా దరఖా స్తులను పరి శీలించి, అర్హుల కు రుణాలు అం దేలా చూస్తాం.

- కేశవులు, ఇన్‌చార్జి బీసీ సంక్షేమ అధికారి, గద్వాల

Updated Date - 2021-10-04T04:42:24+05:30 IST