మత్తుమందును ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకుని మరీ ఓ జూనియర్ డాక్టర్ దారుణం.. ఆమె జేబులో దొరికిన డైరీలో ఏం రాసిందో చూసి..

ABN , First Publish Date - 2022-07-27T20:48:55+05:30 IST

ఆమె ఒక జూనియర్ డాక్టర్ (Junior doctor).. మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని ఇండోర్‌లో ఓ కళాశాలలో పీజీ చదువుతోంది.

మత్తుమందును ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకుని మరీ ఓ జూనియర్ డాక్టర్ దారుణం.. ఆమె జేబులో దొరికిన డైరీలో ఏం రాసిందో చూసి..

ఆమె ఒక జూనియర్ డాక్టర్ (Junior doctor).. మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని ఇండోర్‌లో ఓ కళాశాలలో పీజీ చదువుతోంది.. లేడీస్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆమె తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది.. మత్తుమందును ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకుని ప్రాణాలు తీసుకుంది.. ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. చనిపోయే ముందు పాకెట్ డైరీలో ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 



Wife Missing: నా భార్య కనిపించడం లేదంటూ ఓ భర్త ఫిర్యాదు.. జైపూర్ నుంచి తీసుకొచ్చిన పోలీసులు.. ఎందుకు వెళ్లావని అతడు నిలదీస్తే..


ఇండోర్ (Indore)లోని ఓ మెడికల్ కాలేజ్‌లో పీజీ చదువుతున్న జూనియర్ డాక్టర్ అపూర్వ మంగళవారం హాస్టల్‌లో అపస్మారక స్థితిలో కనిపించింది. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పాకెట్ డైరీలో సూసైడ్ నోట్ దొరకడంతో ఆమెది ఆత్మహత్య అని పోలీసులు భావిస్తున్నారు. `మన అంచనాలను అందుకోలేని వారి నుంచి ఏమీ ఆశించవద్ద`ని అపూర్వ తన డైరీలో రాసుకుంది. చదువులో వెనకబాటుతనం వల్లే అపూర్వ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 


అపూర్వ మీద కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలు ఒత్తిడి పెంచి ఉంటాయని, దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన అపూర్వ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అపూర్వ తన సూసైడ్ నోట్‌లో తన తల్లికి, తండ్రికి, సోదరుడికి క్షమాపణలు చెప్పింది. తాను అందరి నమ్మకాలను వమ్ము చేశానని, బాగా అలసిపోయానని ఆమె రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-07-27T20:48:55+05:30 IST