నిధుల వ్యయం...పారదర్శకం

ABN , First Publish Date - 2022-07-03T05:52:52+05:30 IST

పల్లెలను అభివృద్ధి పథంలో నడి పించాలన్న యోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్య క్రమాలు, పథకాలు మరింత పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో కొత్త నిబంధనలు అమలుల్లోకి వస్తున్నాయి.

నిధుల వ్యయం...పారదర్శకం

- పంచాయతీల్లో డిజిటల్‌ కీ అమలుకు చర్యలు

- రేపటి నుంచి ప్రారంభం కానున్న శిక్షణా శిబిరాలు

- ఇప్పటికే అందిన మార్గదర్శకాలు

- జిల్లాలో 380 పంచాయతీలు

జగిత్యాల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పల్లెలను అభివృద్ధి పథంలో నడి పించాలన్న యోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్య క్రమాలు, పథకాలు మరింత పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో కొత్త నిబంధనలు అమలుల్లోకి వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుం టున్న నిర్ణయాలు, చేపడుతున్న అభివృద్ధితో పల్లెల్లో పురోగతి కనిపించ డంతో పాటు నిధుల వ్యయం పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసు కుం టున్నారు. తాజాగా కొత్త నిబంధనలు అమలుల్లోకి తెచ్చింది. 2021 జనా భా లెక్కల ప్రాతిపదికన పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ నెల నిధులు మంజూరు చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి అక్రమాలకు తా వులేకుండా ఉండడానికి డిజిటల్‌ కీ సంతకాల విధానం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు సంయుక్తంగా సంతకాలు చేసి చెక్కు ల ద్వారా అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నారు. ఇందులో పలు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొత్తగా డిజిటల్‌ సం తకాల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియతో నిధుల వ్యయంలో పా రదర్శకత పెరిగే అవకాశం ఉంది. 


జిల్లాలో పరిస్థితి...

జిల్లా వ్యాప్తంగా 380 గ్రామ పంచాయతీలున్నాయి. గతంలో జిల్లాలో 320 గ్రామ పంచాయతీలుండగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో సుమారు మూడేళ్ల క్రితం 500 జనాభా దాటిన అనుబంధ గ్రా మాలు, తండాలను అప్‌గ్రేడ్‌ చేయడంతో జిల్లాలో ఏర్పడిన 60 పంచాయ తీలతో కలిసి సంఖ్య 380కు పెరిగింది. జిల్లాలో 500 కన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలు 37 ఉన్నాయి. 500 నుంచి 1,000 వరకు జ నాభా కలిగిన పంచాయతీలు 77, వెయ్యి నుంచి అయిదు వేల వరకు జ నాభా గల పంచాయతీలు 253, అయిదు వేలకు పైగా జనాభా గల పం చాయతీలు 13 ఉన్నాయి. జిల్లాలోని పంచాయతీల్లో 7,25,707 జనాభా ఉంది. జిల్లాలో ఒక పంచాయతీ అధికారి, ముగ్గురు డివిజనల్‌ పంచా య తీ అధికారులు, 18 మంది మండల పంచాయతీ అధికారులు, 380 మంది గ్రామ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి, డీపీవో తదితర అధికా రులు, ప్రజాప్రతినిధులకు డిజిటల్‌ కీ అందించనున్నారు.


నిధుల మంజూరు ఇలా..

జిల్లాలోని పంచాయతీలకు ప్రతీ యేటా సుమారు రూ. 30 నుంచి రూ. 40 కోట్లు ఆర్థిక సంఘం ద్వారా కేటాయించబడుతున్నాయి. అదే వి ధంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల నిధులు మంజూరు అవుతున్నాయి. జిల్లాలో 2019-20 సంవత్సరంలో రూ. 75.18 కోట్లు, 2020-21 సంవత్సరంలో రూ. 113.09 కోట్లు, 2021-22 సం వత్సరంలో రూ. 82.43 కోట్లు, 2022-23 సంవత్సరంలో రూ. 14.36 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.90 కోట్లు ఆస్తి పన్ను లక్ష్యం కాగా వంద శాతం పన్ను వసూలు జరిగింది. పంచాయతీల్లో డిజిటల్‌ కీ వ్యవస్థ అమలు వల్ల నిధుల విని యోగంలో పారదర్శకత పెరగనుంది.


అంతా ఆన్‌లైన్‌లోనే...

జిల్లాలోని అన్ని పంచాయతీల్లో 2021-22 నిధులు ఆన్‌లైన్‌ విధానం ద్వారానే ఖర్చు చేయాలని నిర్ణయించారు. దీనికి గాను క్షేత్ర స్థాయిలో సి బ్బందికి శిక్షణ అందించడానికి ప్రణాళిక రూపొందించారు. డిజిటల్‌ కీ విధానం అమలైతే పల్లెల్లో ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే పూర్త య్యే అవకాశాలున్నాయి. డిజిటల్‌ విధానం వల్ల మరింత పురోగతి, వేగ వంతంగా పనులు సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో డిజిటల్‌ కీ విధానం అమలవుతోంది. తాజాగా పంచాయతీ ల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమలు కోసం స ర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల డిజిటల్‌ సంతకాల నమోదు ఇప్పటికే మండ ల పంచాయతీ అధికారులు, గ్రామ కార్యదర్శుల ద్వారా చర్యలు చేప డుతున్నారు. 


రెండేళ్ల కిందటే...

జిల్లాలో సుమారు రెండేళ్ల కిందటే డిజిటల్‌ కీ విధానాన్ని అమలులోకి తేవాలని యోచించారు. కరోనా ఉగ్ర రూపం దాల్చడంతో డిజిటల్‌ విధా నం కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో డి జిటల్‌ కీ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ఓరియస్‌ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. జిల్లా స్థాయిలో జడ్పీ సీఈవో, సీజడ్పీ, మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీపీలు, గ్రామ స్థాయిలో కార్యదర్శి, సర్పంచ్‌లకు డిజిటల్‌ కీలను అందించనున్నారు. ఈ నెల 4వ తేది నుంచి ప్రత్యేక బృందం ద్వారా శిక్షణ అందించనున్నారు. డిజిటల్‌ కీ కోసం అవసరమైన చార్జీలను చెల్లించనున్నారు. ఇందుకు అ వసరమైన మార్గదర్శకాలు, షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి, ఇతర అధికారులతో రాష్ట్ర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సలహాలు, సూచనలు, ఆదేశాలు జా రీ చేశారు. మండలాల్లో ప్రత్యేక అధికారుల బృందాలను నియమించ ను న్నారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. ఇందులో ఇరువురు ఆపరేటర్లు, ఒక డీపీఎం, కంపెనీ నుంచి వచ్చే ఇరువురు ప్ర తినిధులు సభ్యులుగా ఉంటారు.

అభివృద్ధికి తోడ్పాటు...

హరికిరణ్‌, జిల్లా పంచాయతీ అధికారి

ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్‌ సంతకాల కీ ప్రక్రియ అమలు చే సేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రక్రియ అమలు ద్వారా గ్రా మా లు మరింత వేగంగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. ప్రతీ పైసా కు లెక్క ఉంటుంది. దీంతో నిధులు పక్కదారి పట్టకుండా పక్కాగా అభి వృద్ధికి వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2022-07-03T05:52:52+05:30 IST