డెల్టా ప్లస్‌తో థర్డ్ వేవ్..? నిపుణుల్లో ఆందోళన

ABN , First Publish Date - 2021-06-23T03:44:24+05:30 IST

కరోనా సెకెండ్ వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్‌కు తోడు డెల్టా ప్లస్ వేరియంట్ కూడా ప్రస్తుతం ఆందోళన రేపుతోంది.

డెల్టా ప్లస్‌తో థర్డ్ వేవ్..? నిపుణుల్లో ఆందోళన

న్యూఢిల్లీ: కరోనా సెకెండ్ వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్‌కు తోడు డెల్టా ప్లస్ వేరియంట్ కూడా ప్రస్తుతం ఆందోళన రేపుతోంది. ఈ వేరియంట్ కారణంగా దేశంలో మూడో వేవ్ వచ్చి పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 22 డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో..అప్రమత్తమైన కేంద్రం ఈ వేరియంట్ వ్యాప్తిని నిరోధించాలంటూ ఆయా రాష్ట్రాలకు సూచించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీని వ్యాప్తిని అడ్డుకోకపోతే..మునుపటి అంచనా కంటే ముందే దేశంలో కరోనా మూడో వేవ్ రావచ్చు. కాగా.. డెల్టా ప్లస్‌ కేసులు అత్యథికంగా నమోదైన మహారాష్ట్రలో మూడో వేవ్‌ను అడ్డుకునేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు తొమ్మిది దేశాల్లో ఉన్నట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి.  

Updated Date - 2021-06-23T03:44:24+05:30 IST