గంప ‘గుత్త’లా దోపిడీ

ABN , First Publish Date - 2021-06-17T06:19:36+05:30 IST

వేరే జిల్లా నుంచి ధర్మవరం పురపాలకశాఖలోని రెవెన్యూ విభాగానికి ఓ అధికారి డిప్యూటేషన వచ్చాడు.

గంప ‘గుత్త’లా దోపిడీ

మున్సిపల్‌ రెవెన్యూ శాఖలో

 ‘డిప్యూటేషన’ అధికారి హల్‌చల్‌   

ప్రతి పనికీ లంచం ఇవ్వాల్సిందే.. 

నెల ఆదాయం కనీసం రూ.10 లక్షలు పైమాటే..

అధికార పార్టీ నేత పేరు చెప్పుకుని బెదిరింపులు

అవినీతికి సహకరిస్తున్న తనయుడు   

ఉన్నతాధికారులనూ శాసిస్తున్న వైనం 

ధర్మవరం, జూన 16 : వేరే జిల్లా నుంచి ధర్మవరం పురపాలకశాఖలోని రెవెన్యూ విభాగానికి ఓ అధికారి డిప్యూటేషన వచ్చాడు. ఓ ప్రజాప్రతినిధి కావాలనే తనను ఇక్కడి డిప్యూటేషన వేయించుకున్నా డని... నేనేం చెబితే అదే చేయాలని తోటి ఉద్యోగులను బెదిరించడం మొదలు పెట్టారు. రెవెన్యూశాఖలో తన మాట వినని వాళ్లను మరో శాఖకు మార్పించాడు కూడా. దీంతో ఉన్న ఉద్యోగులు అతను ఏం చెబుతే దానికి తలలు ఊపడం అలవాటు చేసుకున్నారు. దీంతో అత ను ఉన్నతాధికారులను సైతం తన కనుసన్నల్లో ఉంచుకున్నాడు. సిబ్బంది ఎదుటే ఆ ప్రజాప్రతినిధితో మాట్లాడుతూ వాళ్లను మరింత భయపెట్టడం ఆయన దినచర్యగా మారింది. ఆయన చెప్పిన పను లు వెంటనే చేయకుంటే అన్న (ప్రజాప్రతినిధి) దృష్టికి తీసుకెళ్తానని బెదిరించేవాడు. దీంతో ఉద్యోగులు ఆయన అడుగులకు మడుగులోత్తే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ అధికారి చెప్పిందే శాసనంగా మారింది. ఏకంగా మున్సిపాలిటీని తన గుప్పెట్లో పెట్టుకొని.. అవినీ తికి పాల్పడుతున్నాడు. 

నెలకు ఆదాయం రూ.10 లక్షలు పైమాటే. 

ఈ అధికారికి అతని తనయుడు కూడా సహకరిస్తుండటంతో ఇక అతని అవినీతికి హద్దే లేకుండా పోయింది. నెలకు కనీసం రూ.10 లక్షలు వసూళ్లు చేసుకుంటున్నారు. కొత్త ఇంటి నిర్మాణానికి అతని తనయుడు సైతం అప్రూవల్‌కు కొలతలు వేస్తుంటాడు. తన కుమా రుడితోనే కొలతలు వేయించుకోవాలని ఆ అధికారి ఆదేశించేవాడు. మిగిలిన లైసెస్సుడు కొలతల సిబ్బంది ఉన్నా... వీరిని కాదని వారిని సంప్రదిస్తే ఆ యాజమానికి ఇబ్బందులు తప్పవు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇంటి యజమానులు అతని కుమారుడితోనే కొలతలు వేయించుకుంటున్నారు. ఏదైనా ఇంటికి రూ.5 వేలు పన్ను వస్తుందనుకుంటే ఏకంగా రూ.15 వేల నుంచి రూ. 20 వేలు పన్ను విధించాల్సి ఉంటుందని చెప్పి... ఆ అధికారి వాళ్లను భయపెట్టేవాడు. రూ. 30 వేలు.. నుంచి రూ. 50 వేలు లంచం వసూలు చేసుకొని.. ఇంటి పన్నును రూ. 5 వేలకు తగ్గించినట్లు  చూపించుకునేవాడు. అతను అనుకున్నంత లంచం ఇవ్వకుంటే ఇక నెలల తరబడి ఆ కార్యాల యం చుట్టూ తిరగాల్సిందే. ఇలా పట్టణ పరిధిలో దాదాపు నెలకు కనీసం అంటే 50 కొత్త ఇళ్లు నిర్మాణాలు జరుగుతుంటాయి. ఎంతలే దన్నా ఈ అధికారి నెలకు కనీసం రూ. 10 లక్షలు ఆదాయా న్ని గ డిస్తున్నాడు. ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో ఉన్నతాధికారులు, సీనియర్‌ ఉద్యోగులు సైతం ఆ అధికారి మాటకే తల ఊపు డం మినహా మరేమి చేయలేని నిహ్సాయస్థితిలో ఉంటున్నారు. 


Updated Date - 2021-06-17T06:19:36+05:30 IST