Advertisement

అధి‘కారు’ల దోపిడి!

Sep 22 2020 @ 01:18AM

అద్దె పేరుతో దర్జాగా దందా

ప్రభుత్వ పనులకు సొంత వాహనాలు

ట్యాక్సీ పేరిట సర్కారు ఖాజనాకు గండి

నిరుద్యోగుల ఉపాధికి కత్తెర


కామారెడ్డి, సెప్టెంబరు 21: ప్రభుత్వ కార్యా లయాల్లో పనిచేసే అధికారులు పర్యటించేందుకు సొంత వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసే పరి స్థితి లేకపోవడంతో వాహనాలను అద్దెకు తీసు కునే వెసులు బాటును ఆయా శాఖల కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అందుకోసం ఒక్కో వాహనా నికి నెలనెల రూ.33 వేల అద్దె చెల్లిస్తామని ఆయా శాఖలకు స్పష్టం చేసింది. జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు ఈ సదుపాయాన్ని విని యోగించుకోవచ్చని తెలిపింది. ట్యాక్సీ ప్లేట్‌ వాహ నం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదునుగా బావించిన పలువురు అధికారులు సొంత కార్లను వినియోగిస్తూ డబ్బులు జేబులో వేసుకుం టున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


నిబంధనలు పట్టవా?

ప్రభుత్వ శాఖల్లో అద్దె వాహనం తీసుకోవాలనుకు న్నప్పుడు వాహనం పూర్తిగా కండిషన్‌గా ఉండడంతో పాటు డ్రైవర్‌కు బ్యాడ్జి నెంబర్‌తో కూడిన లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. నిబంధనల ప్రకారం నెలకు కనీసం 2300 కిలోమీటర్లు వాహనం తిరగాలి. గతంలో వాహనం అద్దె, పెట్రోల్‌ లేదా డీజిల్‌ డ్రైవర్‌ జీతం మొత్తం కలిపి నెలకు రూ.24 వేలు ఇవ్వగా, ప్రస్తుతం రూ.33 వేలకు ప్రభుత్వం పెంచింది. ఇదే అవకాశంగా భావించిన ఆయా శాఖల అధికారులు సొంతవాహనాలను ప్రభుత్వ కార్యాలయాల్లో బినామీ పేర్లతో నడిపిస్తు సొమ్ము చేసుకుంటున్నారు.


ఉపాధి కోల్పోతున్న డ్రైవర్లు

ప్రభుత్వ కార్యాలయాల్లో ట్రాన్స్‌పోర్టు వాహనా లకు బదులుగా వ్యక్తిగత వాహనాలను వాడుతుండ డంతో ఎంతో మంది డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభు త్వం డ్రైవర్‌ కం ఓనర్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా డ్రైవర్లు ఓనర్లుగా మారి ఉపాధి పొందేందుకు వీలుగా సబ్సిడీతో కార్లను అందించే ప్రక్రియ చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధి కారుల కోసం ఈ వాహనాలనే వినియోగించి నిరు ద్యోగులకు ఉపాధి చూపించాలని బావించింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో నిరుద్యోగల కోసం రాయితీలతో వాహనాలను కొనుగోలు చేసేం దుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ ప్రభు త్వ కార్యాలయాన్నింటిలో అధికారులు సొంత వాహ నాలనే వాడుతుండడం, అధికారులకు అనుకూల మైన వ్యక్తుల వాహనాలు, బినామి వాహనాలను ఆయా శాఖల్లో అద్దెకు పెట్టుకోవడంతో అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కరువైంది.


ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో కలిసి దొంగ బిల్లులు

వ్యక్తిగత వాహనాల ద్వారా బిల్లులు పెట్టుకోవ డం సాధ్యం కాకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో కమిషన్‌ మాట్లాడుకొని టాక్సీప్లేట్‌ వా హనాల పేరిట దొంగ బిల్లులను జతపరిచి నెలనెలా బిల్లులను తీసుకుంటున్నట్లు ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్న తస్థాయి అధికారులు సైతం కీలకపాత్ర వహిం చడం గమనార్హం. ప్రభుత్వ విభాగంలో పనిచే స్తున్న అధికారులకు సంబంధించిన వాహనాలపై ‘ఆన్‌గౌట్‌డ్యూటి’ పేరుతో వైట్‌ నెంబర్‌ ప్లేట్‌ ద ర్శనమిస్తున్నాయి. 


ఇలాంటి వాహనాలు ప్రభుత్వ పనుల కోసం బహిరంగంగానే రోడ్లపై తిరుగుతున్నా రవాణా శాఖ విజిలెన్స్‌ అధికారులు మాత్రం పట్టిం చుకున్న దాఖలాలు లేవు. కొన్ని శాఖ ల్లో అయి తే ఏకంగా అందులో పనిచేసే ఉద్యో గులే నాలు గైదు పాతకార్లను కొనుగోలు చేసి అద్దెపేరిట బిల్లులు తీసుకోవడం కొసమెరుపు.


ప్రభుత్వ ఖజానాకు గండి

ప్రభుత్వ కార్యాలయా ల్లో అధికారులు తమ ప నుల కోసం వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తుం డడంతో ప్రభుత్వ ఖాజానాకు గండిపడుతోంది. వ్యక్తిగత వాహనాలకు (వైట్‌ప్లేట్‌), ట్రాన్స్‌పోర్ట్‌ (ఎల్లోప్లేట్‌) వాహనాలకు పన్ను విషయంలో వ్య త్యాసాలు ఉంటాయి. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ప్ర తీ మూడు నెలలకోసారి వాహనాన్ని బట్టి ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏడాదికి ఒకసారి ఫిట్‌నెస్‌ టెస్ట్‌, బీమా తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. సాధారణంగా ఫోర్‌ విలర్‌ వాహనానికి సుమారు 3 నుంచి 5 వేల వరకు ట్యాక్స్‌ ఉండగా, ఏడాదికి కనీసం రూ.12 వేలు ప్రభుత్వానికి చెల్లిం చాల్సి ఉంటుంది. ట్యాక్స్‌ విషయంలో ఏడాదికి కనీ సం రూ.20 నుంచి 25 వేలకు పైనే చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు బదులు వ్యక్తి గత వాహనాలను ప్రభుత్వ కార్యాలయాల్లో అధికా రులు వాడుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున్న గండిపడుతోంది.


వ్య్రక్తిగత వాహనాలు వాడొద్దు- శరత్‌, కలెక్టర్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత వాహనాలను వాడొ ద్దు. కమర్షియల్‌ వాహనాల ను మాత్రమే ఉపయోగించా లి. ప్రభుత్వం ఆయా శాఖల కు ప్రతి నెల రూ.33 వేలు చెల్లిస్తోంది. నిరుద్యో గులకు ఉపాధి కల్పించేందు కు ప్రభుత్వం పలు స్కీంలను అందుబాటులో ఉం చడంతో పాటు కార్పొరేషన్‌, సబ్సిడీ వంటి వెసు లుబాటు కల్పించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కమర్షియల్‌ బదులుగా వ్యక్తిగత వాహనాలను వా డడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుంది.

Follow Us on:
Advertisement
Advertisement