Modi పర్యటనలో పేలుడుపై దర్యాప్తు...డ్రోన్ ద్వారా జారవిడిచిన ఐఈడీ పేలిందా?

ABN , First Publish Date - 2022-04-25T18:24:38+05:30 IST

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జమ్మూలో జరిగిన పేలుడు డ్రోన్ ద్వారా జారవిడిచిన ఐఈడీ కావచ్చునని జమ్మూకశ్మీర్ పోలీసులు అనుమానిస్తున్నారు....

Modi పర్యటనలో పేలుడుపై దర్యాప్తు...డ్రోన్ ద్వారా జారవిడిచిన ఐఈడీ పేలిందా?

జమ్మూ: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జమ్మూలో జరిగిన పేలుడు డ్రోన్ ద్వారా జారవిడిచిన ఐఈడీ కావచ్చునని జమ్మూకశ్మీర్ పోలీసులు అనుమానిస్తున్నారు.సాంబాలో ప్రధాని మోదీ ర్యాలీ జరిగే వేదికకు సమీపంలో ఆయన పర్యటనకు కొన్ని గంటల ముందు డ్రోన్ ఐఈడీని జారవిడిచి ఉండవచ్చనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.జమ్మూలోని లాలియన్ గ్రామంలోని పొలంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి పర్యటించడానికి కొన్ని గంటల ముందు జరిగిన రహస్యంగా డ్రోన్ ద్వారా జారవిడిచిన ఐఈడీ పేలింది. దీంతో భద్రతా గ్రిడ్‌లో అలారం గంటలు మోగించారు. 


భారీ పేలుడు సంభవించే ముందు డ్రోన్‌లాంటి శబ్దం వినిపించిందని స్థానికులు పేర్కొన్నారు.పేలుడు కారణంగా ఏర్పడిన బిలం సమీపంలోని ఇంటి భాగాలు దెబ్బతిన్నాయి. గోడలు పగుళ్లు ఏర్పడ్డాయి. ధ్వని తరంగాలతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి.జైషే మహ్మద్, లష్కరే తోయిబా టెర్రర్ గ్రూపుల వద్ద డ్రోన్‌లు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ప్రధాని మోదీ జమ్మూ పర్యటనను విధ్వంసం చేసేందుకు సుంజ్వాన్ దాడి పెద్ద కుట్ర అని డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు.


Updated Date - 2022-04-25T18:24:38+05:30 IST