అర్ధరాత్రి లారీలో మంటలు..వరుసగా గ్యాస్ సిలిండర్ల పేలుడు

ABN , First Publish Date - 2022-09-02T12:55:56+05:30 IST

కొమరోలు మండలం దద్దవాడ వద్ద గ్యాస్ సిలిండర్ల(Gas cylinders)తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. ఇంజన్‎లో

అర్ధరాత్రి లారీలో మంటలు..వరుసగా గ్యాస్ సిలిండర్ల పేలుడు

prakasam: కొమరోలు మండలం దద్దవాడ వద్ద గ్యాస్ సిలిండర్ల(Gas cylinders)తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. ఇంజన్‎లో మంటలు చెలరేగి లారీకి వ్యాపించాయి. మంటల దాటికి గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాయి. కానీ.. గ్యాస్ సిలిండర్లు(Gas cylinders) ఒక్కొక్కటిగా పేలడంతో మంటలను ఫైర్ సిబ్బంది కూడా అదుపులోకి తీసుకురాలేకపోయారు. భారీ శబ్దంతో సిలిండర్లు పేలడంతో రాత్రంతా దద్దవాడ గ్రామ ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపారు. 100కి పైగా గ్యాస్ సిలిండర్లు పేలినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే.. లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడని తెలిపారు. ఈ ఘటన కర్నూలు నుండి నెల్లూరు జిల్లా ఉలవపాడు వెళ్తుండగా చోటు చేసుకుంది. లారీలో మంటలు..గ్యాస్ సిలిండర్ల పేలుడంతో..అమరావతి-అనంతపురం రహదారిపై రాత్రి నుండి రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2022-09-02T12:55:56+05:30 IST