యూఏఎన్‌తో ఆధార్‌ లింక్‌ గడువు పెంపు

ABN , First Publish Date - 2021-06-16T06:27:04+05:30 IST

కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్‌ అకౌంట్లకు సంబంధించిన యూఏఎన్‌ నంబరును ఆధార్‌ నంబరుతో లింక్‌ చేయడానికి గడువును సెప్టెంబరు 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఈపీఎఫ్‌ఓ

యూఏఎన్‌తో ఆధార్‌ లింక్‌ గడువు పెంపు

న్యూఢిల్లీ, జూన్‌ 15: కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్‌ అకౌంట్లకు సంబంధించిన యూఏఎన్‌ నంబరును ఆధార్‌ నంబరుతో లింక్‌ చేయడానికి గడువును సెప్టెంబరు 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌) నిర్ణయం తీసుకొంది. గతంలో జూన్‌ 1వ తేదీని దీనికి గడువుగా ప్రకటించింది. దీన్ని పొడిగించడం ద్వారా ఉద్యోగుల యూఏఎన్‌ - ఆధార్‌ నంబర్లను లింక్‌ చేయడానికి కంపెనీలకు మరింత సమయం ఇచ్చింది. ఈ నంబర్లను ఇంకా లింక్‌ చేయని ఉద్యోగుల పీఎఫ్‌ రిటర్నులను దాఖలుచేయడానికి కంపెనీలకు వీలు కల్పించింది.

Updated Date - 2021-06-16T06:27:04+05:30 IST