బార్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-03-01T05:41:01+05:30 IST

భైంసా పరిధిలోని రెండు బార్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు స్థానికుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం గడువును పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసిందని జి

బార్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

6వరకు దరఖాస్తుల స్వీకరణ.. 8న లాటరీ పద్ధతిలో ఎంపిక

ఖానాపూర్‌, ఫిబ్రవరి 28 : భైంసా పరిధిలోని రెండు బార్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు స్థానికుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం గడువును పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసిందని జిల్లా మధ్యపాన నిషేధ, అబ్కారీ శాఖాధికారి రవీందర్‌రాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 6వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా కార్యాలయంలో దరఖాస్తుల ను స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ.లక్ష  డిడి(తిరిగి ఇవ్వబడని) లేదా చలానా ద్వారా అందజేయాలని, మూడు కలర్‌ పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌, పాన్‌కార్డులతో పాటు స్వీయ సంతకంతో కూడిన దరఖాస్తును అందజేయాలని తెలిపారు. 8న కలెక్టరు కార్యాలయంలో బార్‌ లైసెన్స్‌దారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు భైంసా ఎస్‌హెచ్‌వో సెల్‌ నెం.9440902715, నిర్మల్‌ ఎస్‌హెచ్‌వో సెల్‌ నెం. 9440902714, డీపీఈవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ సెల్‌ నెం.9985564599 ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-01T05:41:01+05:30 IST