మోడల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పెంపు

ABN , First Publish Date - 2021-06-16T04:57:47+05:30 IST

కరవంజ మోడల్‌ స్కూలులో ఆరు, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెలాఖరు వరకు గడువు పొడిగించారని, ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు నమోదుచేపడుతున్నట్లు ప్రిన్సిపాల్‌ డి.గణేష్‌ పట్నాయక్‌ తెలిపారు.

మోడల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పెంపు

కరవంజ (జలుమూరు) జూన్‌ 15: కరవంజ మోడల్‌ స్కూలులో ఆరు, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెలాఖరు వరకు గడువు పొడిగించారని, ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు నమోదుచేపడుతున్నట్లు ప్రిన్సిపాల్‌ డి.గణేష్‌ పట్నాయక్‌ తెలిపారు. మోడల్‌ స్కూలులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించుకోవాలని కోరారు.  దరఖాస్తు చేసుకొనే ఓసీ, బీసీ విద్యార్ధులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు రూ.50 ఫీజు చెల్లించాలన్నారు. 


 

Updated Date - 2021-06-16T04:57:47+05:30 IST