వలసదారుల నియామకాలపై Oman కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-12-30T18:48:18+05:30 IST

గల్ఫ్ దేశం ఒమన్ తాజాగా వలసదారుల నియామకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగంలోని సంస్థలకు ప్రవాస కార్మికులను నియమించుకునేందుకు గడువును పొడిగించింది.

వలసదారుల నియామకాలపై Oman కీలక నిర్ణయం!

మస్కట్: గల్ఫ్ దేశం ఒమన్ తాజాగా వలసదారుల నియామకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగంలోని సంస్థలకు ప్రవాస కార్మికులను నియమించుకునేందుకు గడువును పొడిగించింది. ఈ మేరకు ఆ దేశ కార్మిక శాఖ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 31తో తాజా గడువు ముగియనుంది. దీన్ని తాజాగా 2022 మార్చి 31 వరకు పొడిగించింది. "ప్రైవేట్ సెక్టార్‌లోని కంపెనీలు ప్రవాస మ్యాన్‌పవర్‌ను నియమించుకునేందుకు గడువును పొడిగిస్తున్నాం. ప్రైవేట్ రంగంలోని కంపెనీలు దాని తాలూకు లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకునేందుకు 2022 మార్చి 31 వరకు అవకాశం కల్పించాం" అని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ తెలిపింది. కార్మికశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి ప్రైవేట్ రంగ సంస్థలు,  వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-12-30T18:48:18+05:30 IST