రంగుల మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-01-20T05:52:38+05:30 IST

తిరుపతమ్మ రంగుల మహోత్సవానికి పెనుగంచిప్రోలు దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

రంగుల మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
పెనుగంచిప్రోలులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న తహసీల్దార్‌, సర్పంచ్‌

పెనుగంచిప్రోలు : తిరుపతమ్మ రంగుల మహోత్సవానికి పెనుగంచిప్రోలు దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.  గురువారం ఉదయం ఆరు గంటలకు అమ్మవారు, పరివార దేవతల విగ్రహాలను బయటకు తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌ మీదగా రంగుల మండపానికి చేరుస్తారు. అక్కడ నుంచి ప్రత్యేకంగా అలంకరించిన 11 ఎడ్లబండ్లపై రాత్రి  8 గంటల సమయంలో గ్రామసరిహద్దులు దాటించి మక్కపేట వద్ద నిలుపుతారు.  శుక్రవారం ఉదయం5 గంటలకు అమ్మవారిని జగ్గయ్యపేటకు తరలిస్తారు. జగ్గయ్యపేటకు చేరుకునే సరికి మధ్యాహ్నం అవుతుందని  ఆలయ చైర్మన్‌ ఇంజం కేశవరావు తెలిపారు. ఏర్పాట్లను తహసీల్దార్‌ నాగభూషణం, సర్పంచ్‌ పద్మకుమారి, రవికుమార్‌  పర్యవేక్షించారు.


Updated Date - 2022-01-20T05:52:38+05:30 IST