విస్త్రృతంగా పోలీసుల తనిఖీలు

ABN , First Publish Date - 2021-05-09T05:49:32+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ రెండో దశలో తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. వీధుల్లోకి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఆయా ప్రాంతాల్లో విస్త్రృతంగా తనిఖీలు చేస్తున్నారు.

విస్త్రృతంగా పోలీసుల తనిఖీలు

పెద్దఎత్తున జరిమానాలు

అయినా రోడ్లమీదకు వస్తున్న ప్రజలు


చిత్తూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వైరస్‌ రెండో దశలో తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. వీధుల్లోకి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఆయా ప్రాంతాల్లో విస్త్రృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిర్లక్ష్యంతో వీధుల్లో తిరిగేవారిని అడ్డుకుంటున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఐదో తేదీ నుంచి మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ప్రకటించింది. కర్ఫ్యూ అమలు ప్రారంభమైన ఈ నాలుగు రోజుల్లో 12,537 రవాణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.12లక్షలకుపైగా జరిమానా విధించారు. 200 మంది దుకాణదారులపై కూడా కేసులు పెట్టారు. అయినా తిరుపతి, చిత్తూరు వంటి నగరాలతోపాటు పట్టణాల్లో 12 గంటల తర్వాత కూడా అక్కడక్కడా దుకాణాలు తెరచి ఉంటున్నాయి. పోలీసులు బలవంతంగా మూయించాల్సి వస్తోంది. కర్ఫ్యూ సమయంలో, ముఖ్యంగా సాయంత్రం పూట ప్రజలు పెద్దఎత్తున రోడ్ల మీద కనిపిస్తున్నారు. ఓ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కర్ఫ్యూ విజయవంతంగా అమలవుతోందని చెప్పవచ్చు.

Updated Date - 2021-05-09T05:49:32+05:30 IST