
అరైవల్స్ టికెట్ ధర పెంపు
కువైట్ సిటీ: కువైట్ వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. తాజాగా అరైవల్స్ టికెట్ ధర పెంచింది కువైట్. దీంతో ఇప్పటివరకు ఉన్న ధరలకు అదనంగా 50 దినార్లు(రూ.12,056) చెల్లించాల్సి ఉంటుంది. మహమ్మారి కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కువైట్ వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా రెండుసార్లు పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. కువైట్లో దిగగానే ఒకసారి కరోనా పరీక్ష చేస్తారు. అప్పుడు 25 దినార్లు(రూ.6,028). మళ్లీ వారం రోజుల తర్వాత రెండోసారి చేసే పీసీఆర్ టెస్టుకు మరో 25 దినార్లు చెల్లించాలి. ఇలా రెండుసార్లు పీసీఆర్ టెస్టుకు అయ్యే 50 దినార్లు ప్రయాణికులే చెల్లించాలి. ఇకపై ఈ 50 దినార్లు ప్రయాణికుల విమాన ఛార్జీలకు కలుపుతారు. కనుక ఇది ప్రయాణికులకు అదనపు భారం కానుంది.