దాడి కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిడి?

Published: Fri, 10 Dec 2021 21:36:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 దాడి కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిడి?

గుంటూరు: ఓ దాడి కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తోన్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు సతమతమవుతున్నారు. మంగళగిరిలో ఇద్దరు యువకులపై ఓ గ్యాంగ్‌ దాడికి పాల్పడింది. రాడ్‌లు, కర్రలతో గ్యాంగ్ దాడి చేసింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేయవద్దని ఓ అధికార పార్టీ ఎంపీ నుంచి ఒత్తిడి వస్తోంది. కేసు పెట్టాలంటూ మరో అధికార పార్టీ నేత నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.  Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.