ఉప్పొంగిన దేశభక్తి

ABN , First Publish Date - 2022-08-17T04:44:34+05:30 IST

ఉత్సాహం ఉరకలెత్తింది... దేశభక్తి ఉప్పొంగింది.. ఏక కాలంలో జాతీయ గీతం మారుమోగింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అందరిలో జాతీయ భావాన్ని నింపింది.

ఉప్పొంగిన దేశభక్తి
ఉండవల్లిలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న విద్యార్థులు, గ్రామస్థులు

జిల్లా వ్యాప్తంగా ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన 

పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు 

హాజరైన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు

భాగస్వాములైన అన్ని వర్గాల ప్రజలు 

   

        ఉత్సాహం ఉరకలెత్తింది... దేశభక్తి ఉప్పొంగింది.. ఏక కాలంలో జాతీయ గీతం మారుమోగింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అందరిలో జాతీయ భావాన్ని నింపింది. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యారు. 


గద్వాల, ఆగస్టు 16 : స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా గద్వాల మండల పరిధిలోని జమ్మిచేడు గ్రామ స్టేజీ వద్ద జములమ్మ ఆలయ చైర్మన్‌ కుర్వ సతీష్‌ కు మార్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ స్థులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. జము లమ్మ ఆలయంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గద్వాల వ్వవసాయ మార్కెట్‌ యార్డులో చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ ఆధ్వర్యంలో వ్యాపారులు, రైతులు, హమా లీలు, డదవాయిలు సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు జాతీయ గీతాన్ని ఆలపించారు.


గద్వాల అర్బన్‌ : జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీఎం శ్రీనివాసులు, సీఐ దేవేందర్‌గౌడ్‌, సిబ్బంది సుధాకర్‌, రాముడు, ప్రసాద్‌, వెంకటేష్‌, శ్రీధర్‌రావు, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


గద్వాల టౌన్‌ : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని పట్టణానికి చెందిన కిరాణ, వర్తక, వాణిజ్య సంఘాల బాధ్యులు మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపన అనంతరం పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. స్థానిక తుల్జారాం దేవాలయం వద్ద అధ్యక్షుడు ఉలిగేపల్లి వీరయ్య ర్యాలీని ప్రారంభించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధా న కార్యదర్శి శ్రీధర్‌, కోశాధికారి ఖలీల్‌, శ్రీకాంత్‌, రమేష్‌ పాల్గొన్నారు.


ఉండవల్లి : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భా గంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌ సర్కిల్‌లో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. ప్రభు త్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజ రై జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఇన్‌ చార్జి ధ్రానోపాధ్యాయుడు మద్దిలేటి, సుజాత, పద్మ లత, సర్పంచు రేఖ, ఎంపీటీసీ సభ్యులు సుంకన్న, రాజశేఖర్‌, కో ఆప్షన్‌ మెంబర్‌ చిన్న బాషుమియ్య, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్‌, మండల అధ్యక్షుడు పిడుగు వెంకటేశ్వర్లు, కృష్ణవేణి ఐటీఐ కరస్పాండెంట్‌ దామోదర్‌ చౌదరి, మక్బుల్‌ బాషా, లోకా రెడ్డి, వెంకట్‌ గౌడు, శొంఠి శ్రీనివాసులు పాల్గొన్నారు.


ధరూరు : మండల కేంద్రంతో పాటు భూరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో  మంగళవారం  సామూహిక జాతీ య గీతాలాపనను ఘనంగా నిర్వహించారు. ధరూరులో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ బండ్ల జ్యోతి పాల్గొన్నారు. కార్యక్రమంలో ధరూరు తహసీల్దార్‌ వెంక టేశ్వర్లు, ఎంపీడీవో జబ్బార్‌, సర్పంచ్‌ పద్మమ్మ, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


గట్టు : మండల కేంద్రమైన గట్టు పంచాయతీ కార్యాలయం అవరణలో మండల అధికారులు, ప్రజాప్రతినిదులు విద్యార్థులతో కలసి సామూహిక జాతీయ గీతా లాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన కళాప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమేష్‌కుమార్‌, సర్పచ్‌ ధనలక్ష్మీ, ఎస్‌ఐ పవన్‌కుమార్‌, ఎంఈవో కొండారెడ్డి, ఎంపీడీవో చెన్నయ్య, కోఅప్సన్‌ మెంబర్‌ సత్యనారాయణ, గోవిందప్ప, న్యాయవాది యుగంధర్‌, క్లాస్‌-1 కాంట్రాక్టర్‌ కృష్ణమూర్తి, కస్తూర్బా ఎస్‌వో గోపిలత, ప్రధానోపాధ్యాయుడు ఓబులేషు, రాము పాల్గొన్నారు. చాగదోణలో ఎంపీపీ విజయ్‌, బల్గెరలో జడ్పీటీసీ సభ్యురాలు శ్యామల, పీఎసీఎస్‌ చైర్మెన్‌ వెంకటేష్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు హనుమంతునాయుడు, బోయలగూడెంలో వైస్‌ ఎంపీపీ సుమతీ సాముహిక గీతాలాపానలో పాల్గొన్నారు.


అయిజ : పట్టణంలో సామూహిక జాతీయ గీతాలాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 500 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు పోతుల మధు సూదన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, మాజీ ఎంపీపీ ప్రకాష్‌గౌడు, తహసీల్దార్‌ యాదగిరి, ఎంఆర్‌ఐలు లక్ష్మీ రెడ్డి, మదు, ఎంపీడీవో సాయిప్రకాష్‌, కమిషనర్‌ నరసయ్య, ఏఈ గోపాల్‌, వ్యవసాయాధికారి శంకర్‌లాల్‌, కౌన్సిలర్‌ రాణి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్లాస్‌పూర్‌ నర్సింహారెడ్డి, సుమలత, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ కన్వీనర్‌ తాహర్‌ పాల్గొన్నారు.


అలంపూరు : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్క రించుకుని అలంపూర్‌ పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, గ్రామస్థులు సామూహిక జాతీ య గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ ఎస్‌ఐ శ్రీహరి ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండా తో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో పోలీసులు, అధికారులు, నాయకులు, విద్యార్థులు నృత్యాలు చేశారు. అంతకుముందు ఉద యం 7.30 గంటల సమయంలో అమరజవాన్లకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటిం చారు. సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్‌ సతీ మణిని అలంపూరు  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు పుష్పలత, ఇంతియాజ్‌, ఆలయ మాజీ చైర్మన్‌ నారాయణ రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ నిత్యానంద్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హృదయరాజు, ఎంఈవో అశోక్‌కుమార్‌, తహసీల్దార్‌ సుభాష్‌నాయుడు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు వెంకట్రామయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.   


అలంపూర్‌ చౌరస్తా : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా అలంపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన జాతీయ గీతాలాపనలో ఉండవల్లి తహాసీల్దారు వీరభద్రప్ప, ఎంపీడీవో అంజనేయరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.


రాజోలి : మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో ఎంపీపీ మరియమ్మ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ, వైస్‌ ఎంపీపీ రేణుక, సర్పంచు వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు షాషావలి, ఎంపీడీవో గోవింద్‌రావు, తాసీల్దార్‌ శ్రీనివాస్‌ శర్మ, ఉపసర్పంచు గోపాల్‌, నాయకులు శ్రీరామ్‌రెడ్డి, గంగిరెడ్డి, నతనేలు, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. 


మానవపాడు : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మానవపాడు మండల కేంద్రంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలపలనలో ఎస్‌ఐ సంతోష్‌, తహశీల్దార్‌ నరేష్‌, ఎంపీడీవో రమణారావు, సర్పంచు హైమావతి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  


కేటీదొడ్డి : వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేటీదొడ్డిలో సామూహిక జాతీయ గీతాలాపనను ఘనంగా నిర్వహించారు.  గద్వాల - రాయచూర్‌ అంత ర్రాష్ట్ర రహదారిపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, తహసీల్దార్‌ సుందర్‌రాజు, ఎంపీడీవో సయ్యద్‌ఖాన్‌, ఏఎస్‌ఐ జిక్కిబాబు, డీటీ కరుణాకర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు, రైతు సంఘం సమన్యవ సమితి అధ్యక్షుడు హనుమంతు పాల్గొన్నారు. 


మల్దకల్‌ : వజ్రోత్సవాల్లో భాగంగా మల్దకల్‌ బస్టాండు చౌరస్తాలో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శేఖర్‌, తహసీల్దార్‌ హరికృష్ణ, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీవో ప్రవీణ్‌,  ఎంపీపీ రాజారెడ్డి, వైస్‌ ఎంపీపీ పెద్ద వీరన్న, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిమ్మారెడ్డి, సర్పంచు యాకోబు, నాయకులు మధుసూధన్‌రెడ్డి, విక్రమసింహారెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు. 


సమ్మెలో ఉన్నా ర్యాలీ

గద్వాల : నిరవధిక సమ్మెలో ఉన్న వీఆర్‌ఏలు దేశభక్తిని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనకు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్‌ రాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోం దని మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వినర్లు వెంకటేశ్వర్లు, మహేష్‌, చంద్రమ్మ, గద్వాల అధ్యక్షులు మహేష్‌, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌, శ్రీనివాసులు, వెంకటేష్‌, వీఆర్‌ఏలు రంగన్న, రాములు, బొగ్గు నర్సిం హులు, బజారమ్మ, పరశురాం పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-17T04:44:34+05:30 IST