ఉప్పొంగిన దేశభక్తి

ABN , First Publish Date - 2022-08-15T06:30:55+05:30 IST

ఉప్పొంగిన దేశభక్తి

ఉప్పొంగిన దేశభక్తి
మైలవరంలో టీడీపీ నేతలు

గొల్లపూడి/జగ్గయ్యపేట/తిరువూరు/మైల వరం/ఇబ్రహీంపట్నం, ఆగస్టు 14: ఎందరో మహ నీయుల త్యాగఫలం స్వాతంత్య్రం అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామ హేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలో పార్టీ నేతలతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌, సుఽభాష్‌ చంద్రబోస్‌, అల్లూరి సీతారామరాజు నుంచి కొమరం భీం వరకు అందర్నీ స్మరించుకోవాలన్నారు. నేషన్‌ ఫస్ట్‌ నినాదాన్ని గట్టిగా వినిపిద్దామని పిలుపునిచ్చారు. గొల్లపూడి బీసీ భవన్‌లో భవానీపురం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు సింహాద్రి గంగారత్నం వారసుడు సత్యనారాయణను సత్కరించారు. విశ్వబ్రాహ్మణ కార్పొ రేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌, ఎస్పీ శేషగిరిరావు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీడీపీ మైల వరం నియోజకవర్గ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ నేతలు పాల్గొన్నారు. 



ఘనంగా తిరంగా ర్యాలీలు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పలుచోట్ల హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలు నిర్వహించారు. జాతీయ జెండాలు చేతబూని ప్రదర్శనల్లో పాల్గొన్న రాజకీయ నాయకులు, విద్యార్థులో దేశభక్తి ఉప్పొంగింది.


విశ్వభారతి-లక్ష్య కాలేజీ ఆధ్వర్యంలో..

జగ్గయ్యపేట సీతారాంపురంలోని విశ్వభారతి-లక్ష్య కళాశాల ఆధ్వర్యంలో తిరంగా రన్‌ నిర్వహించారు. విమలాభాను పౌండేషన్‌ చైర్మన్‌ సామినేని విమలా భాను విద్యార్థినులతో కలిసి జాతీయ జెండాలు చేబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కె.పద్మాశేఖర్‌, కిశోర్‌కుమార్‌, సత్యనారాయణ, సైదా నాయక్‌ పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో హృద యస్పందన సే వాసంస్థ రోగులు, బాలింతలు, గర్భి ణులకు పండ్లు, రొట్టెలు, స్వీట్లను పంపిణీ చేసింది. మాణిక్యాలరావు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

వేడుకలకు పేట సిద్ధం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలకు జగ్గయ్యపేట సిద్ధమైంది. పురపాలక సంఘ కార్యాలయంతో పాటు, అన్ని సచివాలయాలు, లైబ్రరీల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణలకు ఏర్పాట్లు చేశారు. పట్టణంలో వివిధ ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు, పలు కూడళ్లలో, పాఠశాలల వద్ద జెండా పం డుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. పట్టణంలో వార్డుల పునర్విభజన తర్వాత వార్డుల సంఖ్య పెర గడంతో కొత్త వార్డుల్లో జెండా దిమ్మెలు ఏర్పాటు చేస్తు న్నారు. ఆర్టీసీ బస్టాండును జాతీయ జెండా రంగులతో విద్యుద్దీపాలతో అలంకరించారు. అన్ని ప్రభుత్వ కార్యా లయాలు, పలు వ్యాపార సంస్థల వద్ద జాతీయ  జెం డాలతో అలంకరించారు. 

తిరువూరులో 2కే రన్‌

తిరువూరులో హర్ష కరాటే స్కూల్‌ విద్యార్థులు జాతీ య జెండాలతో బోసుబొమ్మ సెంటర్‌లో ప్రదర్శన నిర్వహించారు. యువభారత శక్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వజోత్సవాలను పురస్కరించుకుని రాజుపేట అభయాంజనేయస్వామి ఆలయం నుంచి బైపాస్‌ అయ్యప్పస్వామి ఆలయం వరకు 2కే రన్‌ నిర్వహించారు. గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి బీరం వెంకటరమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ డిగ్రీ కాలే జీలో ఆర్ట్స్‌, పొలిటికల్‌సైన్సు, హిస్టరీ, ఎకనామిక్స్‌ విభాగాల ఆధ్వర్యంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశం సాధించిన ప్రగతి అనే అంశంపై వ్యాసరచన, స్వా తంత్య్ర సాధనలో జాతీయ నాయకులు పాత్రపై వక్తృత్వపు పోటీలు నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సుశీలరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ అబుబాకర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పోగ్రాం ఆఫీసర్‌ టీవీ దుర్గాప్రసాద్‌ పర్యవేక్షించారు. విజయనందరాజు, వేణుమాధవ్‌, సునీల్‌, చెన్నారెడ్డి, సతీష్‌, వెంకటరావు పాల్గొన్నారు. జూనియర్‌ కాలేజీలో విద్యార్థులకు ఆటల పోటీ లను ప్రిన్సిపాల్‌ రెబ్బు మురళీకృష్ణ పర్యవేక్షించారు.



దాములూరులో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ..

స్వాతంత్య్రం కోసం ఎందరో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారని వారి ఆశయాలను నేరవేరుద్దామని టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్‌ అన్నారు. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని దాములూరులో నిర్వహిం చారు. చెరుకుమల్లి చిట్టిబాబు, నల్లూరి పెద్ద అప్పారావు, సుంకర భాస్కరరావు, ఎడ్లపల్లి నాగేశ్వరరావు, షేక్‌ జాన్‌ సైదా, కాటేపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T06:30:55+05:30 IST