Ophthalmology camp: బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం

ABN , First Publish Date - 2022-08-12T16:43:26+05:30 IST

‘మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌’(Madras Bar Association) ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటివైద్య శిబిరం జరిగింది. మద్రాస్‌ హైకోర్టు భవనం నిర్మించి

Ophthalmology camp: బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం

చెన్నై, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌’(Madras Bar Association) ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటివైద్య శిబిరం జరిగింది. మద్రాస్‌ హైకోర్టు భవనం నిర్మించి 130 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాధ్‌ భండారీ(Justice Munishwarnadh Bhandari) లాంఛనంగా ప్రారంభించారు. హైకోర్టు ప్రాంగణంలోని మీటింగ్‌హాలులో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో పూందమల్లిలోని అరవింద ఐ హాస్పిటల్‌ వైద్యులు, సిబ్బంది పాల్గొని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, గుమస్తాలు, కోర్టు సిబ్బంది ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. బార్‌ అధ్యక్షుడు వీఆర్‌ కమలనాధన్‌, కార్యదర్శి డి.శ్రీనివాసన్‌ తదితరుల నేతృత్వంలో ఈ శిబిరం ఏర్పాటైంది. 

Updated Date - 2022-08-12T16:43:26+05:30 IST