కంటి వైద్యానికి ఫాకో మెషీన్‌ : డీహెచ్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-07-01T06:34:36+05:30 IST

రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలోని కంటి వైద్య విభాగానికి కొత్తగా అత్యాధునిక ఫాకో మెషీన్‌ అందుబాటులోకి వచ్చిందని, దీనిద్వారా కాటరాక్టు ఆపరేషన్లు సులభంగా చేయవచ్చని డీహెచ్‌ఎస్‌ సనత్‌కుమారి అన్నారు.

కంటి వైద్యానికి ఫాకో మెషీన్‌ : డీహెచ్‌ఎస్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 30 : రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలోని కంటి వైద్య విభాగానికి కొత్తగా అత్యాధునిక ఫాకో మెషీన్‌ అందుబాటులోకి వచ్చిందని, దీనిద్వారా కాటరాక్టు ఆపరేషన్లు సులభంగా చేయవచ్చని డీహెచ్‌ఎస్‌ సనత్‌కుమారి అన్నారు. గురువారం ఫాకో మెషీన్‌ ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. ఫాకో మెషీన్‌తో కొత్త పద్ధతిలో సర్జరీలు సులభంగా చేయవచ్చన్నారు. పేపర్‌మిల్లు సీఎస్‌ఆర్‌ నిధులతో దీన్ని సమకూర్చడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాల్‌ సతీష్‌కుమార్‌, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ మల్లికార్జునరాజు మాట్లాడుతూ జిల్లాలో రాజమహేంద్రవరంలోనే తొలిసారి అడ్వాన్సుడు ఫాకో సర్జరీ సేవలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యవిభాగం అధిపతి డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ శాంతి కమల తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-01T06:34:36+05:30 IST