మాఫియాపై కన్ను

ABN , First Publish Date - 2021-07-27T04:24:02+05:30 IST

అక్రమ దందాలకు నడిగడ్డ అడ్డాగా మారు తోంది.

మాఫియాపై కన్ను
గద్వాల శివారులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో పోసిన మట్టి కుప్పలు

- అక్రమాలకు అడ్డాగా మారిన నడిగడ్డ

- పేట్రేగిపోతున్న మట్టి, రేషన్‌ మాఫియా

- దందాల్లో పోలీసుల పాత్రపై ఇంటలిజెన్స్‌ విచారణ

- పలు కేసుల్లో సెటిల్‌మెంట్లు చేశారని ఆరోపణ

- గద్వాల పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని కొందరు అధికారులపై డీజీపీకి ఫిర్యాదులు

- గోప్యంగా విచారణ చేసిన  ఇంటలిజెన్స్‌ అధికారులు


గద్వాల, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : అక్రమ దందాలకు నడిగడ్డ అడ్డాగా మారు తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో జరుగు తున్న మట్టి మాఫియా ఆగడాలు, పోలీసుల పాత్రపై ఇంటలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తు న్నారు. ఈ మాఫియా ఆగడాలపై ఇటీవల డీ జీపీ, హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ వెస్ట్‌ జోన్‌ ఐ జీకి ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ మొదలు పెట్టారు. ఫిర్యాదులో కూడా ప్రధానంగా మట్టి త రలింపునకు పోలీసుల సహకారంపైనే పేర్కొనడం తో, అధికారులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు.

ప్రస్తుతం జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెం దిన నాయకులుగా చెప్పుకునే ఇద్దరు వ్యక్తులు మట్టి దందా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ‘రియల్‌’ భూ మ్‌ ఉండటం.. వెంచర్లు వేసి ప్లాట్లుగా చదును చేయడానికి ఎర్రమట్టి అవసరం ఉండటంతో ఈ దందాకు డిమాండ్‌ ఉంది. కొందరు అనుమ తులు తీసుకొని పట్టా పొలాల్లో తవ్వుతున్నామని చెప్పుకుంటుండగా, మ రొకరు ఎవరినీ లెక్క చేయకుండా మట్టి దందాను నిర్వహిస్తున్నారు. అయితే, మీడియా, ఇతర పార్టీల నజర్‌ ఎక్కువ కావడంతో కొంత సైలెంట్‌గా కనిపించి నా, ఇద్దరిపై ఒకరంటే ఒకరికి పడని విధంగా పరిస్థితి తయారైంది. ఇందులో ఒక వర్గానికి మాత్రమే పోలీసుల సహకారం ఉండటం.. మరొక వర్గానికి చెందిన వ్యక్తులు మట్టి తరలించేటప్పుడు వాహనాలను పట్టుకోవడం వంటివి చేస్తున్నారనే విమర్శలు ఉన్నా యి. అయితే, ఓ మాజీ ప్రజాప్రతినిధి తమ్ముడు తాను అనుమతులు తీసుకొని మట్టి తర లిస్తున్నానని, తనకు సంబంధించిన వాహనాలనే పోలీసులు టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపి స్తున్నారు. మరో వ్యక్తి ప్రభుత్వ భూముల్లో మట్టి తరలి స్తున్నా, చర్యలు తీసుకోవడం లేదని, తాను డయల్‌ 100 చేసినా.. ముందే సదరు వ్యక్తికి సమాచారం చేరవేస్తున్నారని విమర్శి స్తున్నారు. అయితే, ఇన్ని రోజులు ఈ రెండు వర్గాలు ఇష్టారీతిన మట్టి తవ్వకాలు జరిపారు. రాజకీయ కారణాలతో ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులు పరస్పర ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండగా, ఈ ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా చేసిన విచారణలో మట్టి మాఫియాలో కీలక వ్యక్తిగా ఉన్న వారి దగ్గర పో లీసులు ఏమి ఆశపడుతున్నారనే విషయంపై ఆరా తీశారు. సదరు నివేదికను డీజీపీకి అందజేసిన తర్వాత పోలీసు అధికారులపై చర్యలుంటాయని తెలుస్తోంది.


ఈ అంశాలపై కూడా..

జిల్లాలో మట్టి, రేషన్‌ మాఫియాలో పోలీసుల సంబంధాలపై మాత్రమే కాకుండా మరికొన్ని అం శాలపై కూడా ఫిర్యాదులు వచ్చిటన్లు తెలిసింది. అందులో మల్దకల్‌ మండలంలోని ఓ గ్రామంలో భూ వివాదానికి సంబంధించిన సెటిల్‌మెంట్‌లో పోలీసులు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.18 లక్షలు తీ సుకుని కేసును సెటిల్‌ చేశారనే ఆరోపణలపై ఇంటలిజెన్స్‌ అధికారులు విచారణ చేసినట్లు విశ్వ సనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ఒక ప్రేమ వివాహం విషయంలో ప్రియుడి హత్య, ప్రియు రాలి ఆత్మహత్య జరిగిన విషయంలో డబ్బులు తీసుకున్నారని, కేటీ దొడ్డి మండలంలోని ఓ మహిళపై లైగింక వేధింపుల కేసులో ఇబ్బందులకు గురి చేయడం, ధరూర్‌ మండలంలోని జూరాల డ్యామ్‌ వద్ద బ్లాస్టింగ్‌కు సంబంధించిన కేసు విషయంలో నిందితుడిని తప్పించడం కోసం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై కూడా విచారణ జరిగినట్లు తెలిసింది. సుంకులమ్మ దేవరకు జంతుబలికి సంబంధించిన విషయంలోనూ డబ్బులు డిమాండ్‌ చేయడం, కిందిస్థాయి పోలీసు సిబ్బందిని వేధించిన విషయంలో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వాటిపై కూడా ఇంటలిజెన్స్‌ అధికారులు విచారణ చేపట్టిన ట్లుగా సమాచారం ఉంది. అయితే, ప్రధానంగా ఇంటలిజెన్స్‌ విచారణ విభిన్న దందాల్లో, కేసుల సె టిల్‌మెంట్‌లో పోలీసు పాత్రపైనే జరిగిందని స్పష్టమవుతోంది.

Updated Date - 2021-07-27T04:24:02+05:30 IST