ఫేస్‌ బ్లైండ్‌నెస్‌

Published: Tue, 05 Jul 2022 03:01:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఫేస్‌ బ్లైండ్‌నెస్‌

లకట్టు, ముఖ కవళికలు, స్వరం మొదలైన లక్షణాలు ఒకర్ని గుర్తుపట్టడానికి సహాయపడతాయి. కానీ ‘ప్రోసోపాగ్నోసియా’ అనే సమస్య ఉన్నవాళ్లకు పరిచయస్తులను గుర్తుపట్టడం కష్టమవుతుంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌ పిట్‌తో తాజాగా వెలుగులోకొచ్చిన ఈ సమస్య నిజానికి కొత్తదేమీ కాదు. 19వ శతాబ్దంలోనే వెలుగుచూసిన ఈ ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ సమస్యకు జర్మన్‌ న్యూరాలజిస్ట్‌, జోఖిమ్‌ బోడమెర్‌, ‘ప్రోసెపాగ్నోసియా’ అని పేరు పెట్టాడు. ఈ సమస్య ఉన్నవాళ్లు సన్నిహిత కుటుంబ సభ్యులను, స్నేహితులను గుర్తుపట్టడంలో కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. స్ట్రోక్‌ లేదా రక్తస్రావంలో అడ్డంకి, రక్తపు గడ్డ (హెమరేజ్‌), ట్యూమర్‌ తలెత్తడం మూలంగా మెదడు కుడి వైపున ఉండే టెంపరో ఆక్సిపిటల్‌ ఏరియా దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య మొదలవుతుందని వైద్యులు అంటున్నారు. అయితే అల్జీమర్స్‌, పార్కిన్‌సన్‌ వ్యాధుల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్య తీవ్రమైనప్పుడు, మూల కారణాన్ని సరిదిద్దే చికిత్సను వైద్యులు అనుసరిస్తారు. స్ట్రోక్‌ మూలంగా సమస్య తలెత్తితే, ఆ సమస్యను సరిచేయడం, ట్యూమర్‌ కారణమైతే, కీమోథెరపీ, రేడియేషన్‌తో దాన్ని కరిగించడం, హెమరేజ్‌కు అందుకు తగిన చికిత్సతో కరిగించడం ద్వారా ఫేస్‌ బ్లైండ్‌నె్‌సను సరిదిద్దవచ్చని వైద్యులు అంటున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.