ఫేస్ మాస్క్‌తో అందం రెండింతలు.. ఆశ్చర్యపరుస్తున్న అధ్యయన ఫలితాలు

ABN , First Publish Date - 2022-01-16T15:51:58+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ఎవరైనా..

ఫేస్ మాస్క్‌తో అందం రెండింతలు.. ఆశ్చర్యపరుస్తున్న అధ్యయన ఫలితాలు

కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ఎవరైనా ముఖానికి మాస్క్ ధరిస్తే వారు ఏదో వ్యాధితో బాధపడుతున్నారనో  లేదా ముఖంలో ఏదైనా లోపాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారనో అనుకునేవారు. కానీ కరోనా ప్రజల మనస్తత్వాన్ని, జీవనశైలిని సంపూర్ణంగా మార్చివేసింది. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో మాస్క్‌లు ధరించే మహిళల ముఖాలు మరింత అందంగా కనిపిస్తున్నట్లు తేలింది. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ కోవిడ్ వచ్చాక, అందంపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ సైకాలజీ ఈ అధ్యయనం చేపట్టింది. 


ఫేస్ మాస్క్‌లు వ్యక్తుల ముఖాలను మరింత ఆకర్షణీయంగా మార్చడమే కాకుండా అందంగా కూడా మారుస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. ముఖంలోని దిగువ భాగంలో ధరించే మాస్క్ కారణంగా మరింత అందంగా కనిపిస్తారని తేలింది. అలాగే మాస్క్ నీలి రంగులో ఉంటే ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుందని వెల్లడయ్యింది. ఈ సందర్భంగా కార్డిఫ్ యూనివర్శిటీ, స్కూల్ ఆఫ్ సైకాలజీ హెడ్, ఫేస్ ఎక్స్‌పర్ట్ పెండెఫిక్ మాట్లాడుతూ కరోనాకు ముందు ఎవరైనా మాస్క్ ధరిస్తే వారు ఏదో వ్యాధితో బాధపడుతున్నారని అనుకునేవారు. అయితే ఇప్పుడు ఈ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. బ్లూ సర్జికల్ మాస్క్‌లు ధరించిన వ్యక్తుల ముఖాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని తేలింది. ఈ అధ్యయనంలో మాస్కులు కలిగిన మహిళల ముఖాలు, మాస్కులు లేని మహిళల చిత్రాలను పరిశీలించారు. వీటిలో నీలిరంగు సర్జికల్ మాస్క్‌లు ధరించిన మహిళల ముఖాలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని గుర్తించారు. మాస్క్ ధరించినవారి కళ్ళు అందానికి ప్రతిబింబంగా నిలిచాయని తేలింది. ఈ అధ్యయన ఫలితాలు కాగ్నిటివ్ రీసెర్చ్: ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

   

Updated Date - 2022-01-16T15:51:58+05:30 IST