ఫేస్‌ ఆయిల్స్‌తో ముఖానికి మెరుపు

Dec 8 2021 @ 00:00AM

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌తో చర్మ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఏ నూనె ఎవరికి ఉపయోగమో, ఏ చర్మానికి ఏ నూనె ప్రయోజనకరమో తెలుసుకుందాం!


గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌

చర్మ తత్వం: జిడ్డు చర్మం, మిశ్రమ చర్మం, సున్నిత చర్మం, వయసు పైబడే చర్మం

ప్రయోజనాలు: నల్లని వలయాలు చర్మంలో కలిసిపోవడానికి తోడ్పడుతుంది. 

ఇలా వాడాలి: రాత్రి నిద్రకు ముందు ముఖం మీద పలుచగా పూసుకోవాలి.


ఆముదం

చర్మ తత్వం: పొడి చర్మం, వయసు పైబడే చర్మం

ప్రయోజనాలు: స్ర్టెచ్‌ మార్క్స్‌ తొలగిపోతాయి. పొడి పెదవులు మృదువుగా తయారవుతాయి. ముడతలు తగ్గుతాయి.

ఇలా వాడాలి: నిద్రకు ముందు చర్మం మీద పూసుకోవాలి.


రోజ్‌హిప్‌ ఆయిల్‌

చర్మ తత్వం: జిడ్డు, సున్నిత చర్మం, వయసు పైబడే చర్మం

ప్రయోజనాలు: పిగ్మెంటేషన్‌ తగ్గుతుంది. మచ్చలు తగ్గుతాయి. డ్యామేజ్‌ అయిన చర్మం బాగవుతుంది. చర్మం మీద గీతలు తగ్గుతాయి.

ఇలా వాడాలి: ప్రతి రోజూ మాయిశ్చరైజర్‌తో పాటు రెండు చుక్కల రోజ్‌హిప్‌ ఆయిల్‌ వాడుకుంటే చర్మానికి అదనపు మెరుపు, మృదుత్వం దక్కుతుంది.


నీమ్‌ ఆయిల్‌

చర్మ తత్వం: పొడి చర్మం, మిశ్రమ చర్మం, జిడ్డు చర్మం

ప్రయోజనాలు: ఫంగల్‌  ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతుంది. చర్మానికి రక్షణ అందిస్తుంది. వయసు పైబడే చర్మానికి పోషకాలను అందిస్తుంది.

ఇలా వాడాలి: రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను నీమ్‌ ఆయిల్‌కు జోడించి, నిద్రకు ముందు పూసుకోవాలి.


ఆర్గాన్‌ ఆయిల్‌

చర్మ తత్వం: జిడ్డు చర్మం, మిశ్రమ చర్మం, సున్నిత చర్మం, వయసు పైబడే చర్మం

ప్రయోజనాలు: చర్మం చిట్లడం ఆగుతుంది. పెదవుల పగుళ్లు తగ్గుతాయి. స్ట్రెచ్‌ మార్క్స్‌ తగ్గుతాయి.

ఇలా వాడాలి: ముఖాన్ని ఈ నూనెతో మర్దన చేయాలి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.