ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఇంట్లోనే ఇవి ట్రై చేయండి!

ABN , First Publish Date - 2022-06-01T19:07:59+05:30 IST

ముఖంపై మొటిమలు, మచ్చలు ఉంటే అందాన్ని దెబ్బతీస్తాయి. జిడ్డును పోగొట్టి ముఖంలో మెరుపు తీసుకురావాలంటే మార్కెట్‌లోని సౌందర్యసాధనల జోలికి వెళ్లాల్సిన

ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఇంట్లోనే ఇవి ట్రై చేయండి!

ఆంధ్రజ్యోతి(01-06-2022)

ముఖంపై మొటిమలు, మచ్చలు ఉంటే అందాన్ని దెబ్బతీస్తాయి. జిడ్డును పోగొట్టి ముఖంలో మెరుపు తీసుకురావాలంటే మార్కెట్‌లోని సౌందర్యసాధనల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో దొరికే వాటితోనే ముఖవర్చస్సును పొందవచ్చు. సులువుగా కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ ఇలా తయారు చేసుకోవచ్చు...


కప్పులో టేబుల్‌ స్పూన్‌ శనగపిండి, కొద్దిగా పసుపుకొమ్మనుంచి నూరిన సహజమైన పసుపు తీసుకోవాలి. నీళ్లు లేదా రోజ్‌వాటర్‌ను సరియైున మోతాదులో వేసి పేస్ట్‌గా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయటం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.


సౌందర్య ఉత్పత్తుల ప్రపంచంలో అలొవెరాకు ఉండే ప్రాధాన్యతే వేరు. కప్పులో టేబుల్‌ స్పూన్‌ అలొవెరా జెల్‌, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి మిక్స్‌ చేయాలి. వెళ్లతో మర్దన చేసుకుంటూ ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రపరచాలి. దీనివల్ల చర్మంపై ఉండే నొప్పులు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.

Updated Date - 2022-06-01T19:07:59+05:30 IST