
ఆంధ్రజ్యోతి(13-04-2022)
చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, నిగారింపు సంతరించుకునేలా చేయడంలో ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవిలో వారానికోసారి ఈ ప్యాక్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పాలమీగడ, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు వదిలేయాలి. తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.