టమోటాతో ఫేస్‌ ప్యాక్స్‌!

ABN , First Publish Date - 2022-09-22T17:46:23+05:30 IST

టమోటా పడనిదే ఏ కూరయినా రుచిగా ఉండదు. టమోటాలతో ఫేస్‌ప్యాక్‌ వేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్‌ ఉపయోగాలేంటో తెల్సుకుందామా..

టమోటాతో ఫేస్‌ ప్యాక్స్‌!

టమోటా పడనిదే ఏ కూరయినా రుచిగా ఉండదు. టమోటాలతో ఫేస్‌ప్యాక్‌ వేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్‌ ఉపయోగాలేంటో తెల్సుకుందామా..


  • టమోటా రసం ముఖం మీద పట్టిస్తే జిడ్డు తగ్గిపోతుంది. సహజంగా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
  • టమోటాను మెత్తగా చూర్ణం చేసి దీనికి బ్రౌన్‌ షుగర్‌ కలిపి పట్టిస్తే డెడ్‌ స్కిన్‌ తొలగిపోతుంది.
  • టీ ట్రీ ఆయిల్‌ రెండు చుక్కలు, టమోటా జ్యూస్‌ కలిపి పట్టిస్తే బ్యాక్టీరియా పోతుంది. ఇచ్చింగ్‌తో పాటు నొప్పులు ఉండవు.
  • పసుపుతో కలిపి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • మెత్తగా చూర్ణం చూసిన టమోటాను పట్టిస్తే నల్లమచ్చలు, పిగ్మెంటేషన్‌ కనిపించదు.
  • నిమ్మరసంతో కలిపి పట్టిస్తే చర్మం అందంగా, స్మూత్‌గా ఉంటుంది. 
  • ఇదో మంచి మాయిశ్చరైజర్‌. సూర్యకిరణాలనుంచి కాపాడే గుణం టమోటా రసానికి ఉంది.
  • ప్రతి రోజూ టమోటా రసాన్ని పట్టించుకుని ఇరవై నిమిషాల తర్వాత ముఖంలో నునుపుదనం వస్తుంది. యాంటీ ఏజింగ్‌గా కూడా ఉపయోగపడుతుంది.

Updated Date - 2022-09-22T17:46:23+05:30 IST