ట్రాకింగ్‌కు దూరంగా.... ‘ఆఫ్‌-ఫేస్‌బుక్‌ యాక్టివిటీ’

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

యాప్స్‌, వెబ్‌సైట్‌ నుంచి తీసుకున్న డేటాను ట్రాక్‌ చేయకుండా రక్షణ పొందవచ్చు. ‘ఆఫ్‌-ఫేస్‌బుక్‌ యాక్టివిటీ’ ఫీచర్‌ అందుకు తోడ్పడుతుంది.

ట్రాకింగ్‌కు దూరంగా.... ‘ఆఫ్‌-ఫేస్‌బుక్‌ యాక్టివిటీ’

యాప్స్‌, వెబ్‌సైట్‌ నుంచి తీసుకున్న డేటాను ట్రాక్‌ చేయకుండా రక్షణ పొందవచ్చు. ‘ఆఫ్‌-ఫేస్‌బుక్‌ యాక్టివిటీ’ ఫీచర్‌ అందుకు తోడ్పడుతుంది. నిజానికి ఈ ఫీచర్‌ను ‘ఫేస్‌బుక్‌’ గత ఏడాదే ఆరంభించింది. ఈ ఫీచర్‌ మీ దగ్గర ఉంటే చాలు, వివిధ వెబ్‌సైట్లు, యాప్‌ల నుంచి షేర్‌ చేసిన డేటాను క్లియర్‌ చేసేసుకోవచ్చు. అంతే, ఆ తర్వాత ఇక ఫేస్‌బుక్‌ వీటిని ట్రాక్‌ చేయలేదు. 


ఇందుకోసం సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీలోకి వెళ్ళాలి. సెట్టింగ్స్‌పై   తదుపరి యువర్‌ ఫేస్‌బుక్‌ ఇన్ఫర్మేషన్‌పై క్లిక్‌ చేయాలి. చివరగా ఆఫ్‌ ఫేస్‌బుక్‌ యాక్టివిటీని క్లిక్‌ చేయాలి. అపై దేన్నైనా టర్నాఫ్‌ చేసి హిస్టరీని క్లియర్‌ చేసుకోవచ్చు. ఈ టూల్‌తో  ఒక సారి హిస్టరీని క్లియర్‌ చేస్తే చాలు, వెబ్‌సైట్స్‌ అలాగే యాప్స్‌ నుంచి తీసుకుని  తన ద్వారా షేర్‌ చేసిన డేటాను ఫేస్‌బుక్‌ తొలగిస్తుంది. 

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST