Facebookలో యువతితో పరిచయం.. హైదరాబాద్‌లో కలిసి.. ఎన్నెన్ని ట్విస్ట్‌లు ఉన్నాయో చూడండి..

ABN , First Publish Date - 2022-05-30T15:28:37+05:30 IST

Facebookలో యువతితో పరిచయం.. హైదరాబాద్ కలిసి.. ఎన్నెన్ని ట్విస్ట్‌లు ఉన్నాయో చూడండి..

Facebookలో యువతితో పరిచయం.. హైదరాబాద్‌లో కలిసి.. ఎన్నెన్ని ట్విస్ట్‌లు ఉన్నాయో చూడండి..

  • యువతిపై లైంగిక దాడి..
  • కేసు మాఫీ కోసం పెళ్లి
  • ఆ తర్వాత మళ్లీ వేధింపులు..
  • రెండు కేసుల్లో నిందితుడు.. ప్రస్తుతం పరారీలో..

హైదరాబాద్‌ సిటీ : ఫేస్‌బుక్‌ (Facebook) పరిచయంతో నగరానికి వచ్చి ఆమెను కలిశాడు. మత్తు మందు కలిపి ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫొటోలు, వీడియోలతో బెదిరించి పలుమార్లు లైంగికదాడి చేశాడు. గర్భం దాల్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు మాఫీ కోసం పెళ్లి చేసుకున్నాడు. ఆపై అదనపు కట్నం కోసం వేధించేవాడు. అంతేకాకుండా కేసు వెనక్కి తీసుకోవాలని గత నెలలో ఇంట్లో బంధించి చంపేందుకు ప్రయత్నించాడు. ఏపీకి చెందిన వైసీపీ నేత (YSRCP Leader) (ఇటీవల గుండెపోటుతో చనిపోయిన) అనుచరుడినని, తననెవ్వరూ ఏమీ చేయలేరని బెదిరించాడు. ఎలాగోలా తప్పించుకుని వచ్చిన ఆమె పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. సైబరాబాద్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలోని రెండు వేర్వేరు పీఎస్‌లలో రెండు కేసులు నమోదైన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా, తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీ‌స్‌స్టేషన్‌ చుట్టూ తిరుగుతోంది.


అత్తింట్లో అడుగడుగునా కష్టాలు..

యువతి వద్దకు వచ్చిన కృష్ణారెడ్డి పెళ్లి చేసుకుని మంచిగా చూసుకుంటానని మళ్లీ నమ్మించాడు. బాచుపల్లి పీఎస్‌లో ఉన్న కేసును కాంప్రమైజ్‌ చేసుకోవాలని నచ్చ చెప్పాడు. పెళ్లి చేసుకున్నాక కేసును క్లోజ్‌ చేద్దామని చెప్పింది. దీంతో ఈ సారి పెద్దల సమక్షంలో భారీ ఎత్తున రూ. 5 లక్షల కట్నం, 50 తులాల బంగారు ఆభరణాలతో ఈ ఏడాది మార్చి 27న కొండాపూర్‌లో వివాహం (Marriage) జరిగింది. అత్తింట్లో అడుగు పెట్టిన ఆమెకు అక్కడా కష్టాలు తప్పలేదు. అత్తమామలు, ఆడపడుచు అందరూ ఆమెను వేధించేవారు.


బాధితురాలి కథనం ప్రకారం.. 

కడప జిల్లాకు (Kadapa) చెందిన యువతికి మూడేళ్ల క్రితం (2019 జూన్‌లో) ఫేస్‌బుక్‌ ద్వారా నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, నందవరం గ్రామానికి చెందిన చుండి కృష్ణారెడ్డి పరిచయం అయ్యాడు. కొద్ది రోజులు చాటింగ్‌ అనంతరం కలుద్దామని అనుకున్నారు. 2019 ఆగస్టు 17న నగరంలోని బాచుపల్లిలో ఉండే ఆమెను కలవడానికి కృష్ణారెడ్డి (Krishna Reddy) వచ్చాడు. నిజాంపేటలో ఓ రూమ్‌ తీసుకుని మాట్లాడదామని అక్కడకు పిలిచాడు. ఆమె అతడు చెప్పిన అడ్రస్‌కు వెళ్లింది. అక్కడకు వెళ్లగానే జ్యూస్‌లో (Juice) మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత లైంగికదాడికి పాల్పడ్డాడు.


అనంతరం చెప్పినట్లు వినకుంటే ఫొటోలు, వీడియోలు (Photos, Videos) సోషల్‌మీడియాలో పెడతానని బెదిరిస్తూ తరచూ లైంగికంగా వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకుంటానని, అయితే తొలుత గర్భం తొలగించాలని నమ్మించి నిజాంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో (Private Hospital) ఆరు నెలల గర్భం తీయించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు 2021 మే 9న బాచుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడు.


నాలుగో రోజు నుంచే దాడి..

పెళ్లి జరిగిన నాలుగో రోజున కేసును వెనక్కి తీసుకోవాలని కృష్ణారెడ్డి కోరాడు. తర్వాత తీసుకుంటానని చెప్పడంతో కొట్టాడు. అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న ఇంట్లో బంధించిన భర్త వెంటనే కేసు వెనక్కి తీసుకోకుంటే చంపేస్తానని బెదిరించాడు. కర్టెన్‌ రాడ్‌లతో తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన ఆమె గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా కృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అతడి బెయిల్‌ రద్దు (Bail) అయింది. ప్రస్తుతం బాచుపల్లి, గచ్చిబౌలి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆయా పీఎస్‌ల చుట్టూ తిరుగుతోంది.

Updated Date - 2022-05-30T15:28:37+05:30 IST