
చల్లపల్లి, జూన్ 26 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చల్లపల్లి రాజా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించి, నగదు బహుమతులను, జ్ఞాపికలను అందజేశారు. లయన్స్‌క్లబ్ సర్వీ్‌ససెంటర్‌లో ఆదివారం చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానాన్ని పొందిన 22 మంది విద్యార్థులకు రూ.రెండు వేల నగదు బహుమతి, జ్ఞాపికను అందచేసి విద్యార్థులను, తల్లిదండ్రులను సత్కరించారు.చల్లపల్లి సీఐ బి.భీమేశ్వర రవికుమార్ ముఖ్య అతిఽథిగా పాల్గొని పూర్వవిద్యార్థుల అసోసియేషన్ సేవలను అభినందించారు. విశ్రాంత ప్రిన్సిపాల్ టి.సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంఈవో వి.మురళీకృష్ణ, మోపిదేవి ఎస్సై జనార్దన్, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, అసోసియేషన్ అధ్యక్షుడు జి.అశ్వినీకుమార్, లయన్స్ నర్రా సాయిబాబు ప్రసంగించారు.