కొవిడ్‌ను ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది

ABN , First Publish Date - 2021-04-18T05:14:30+05:30 IST

కొవిడ్‌ మహామ్మారిని ఎదుర్కోవడం మన చేతులోనే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ (సంచాలకులు) అమర్‌సింగ్‌ నాయక్‌ అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం సుభాష్‌నగర్‌లోని సిరిసిల్ల పంక్షన్‌ హాల్‌లో సిరిసిల్ల ము న్సిపల్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌- 19 వాక్సిన్‌. రెండో దశ వైరస్‌ ప్రబల కుండా తీసుకునే జాగ్రత్తలపై డీఎంహెచ్‌వో, రెవెన్యూ, పోలీస్‌ డిపార్ట్‌మెంట్ల అధికారులు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు.

కొవిడ్‌ను ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది
మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ అమర్‌సింగ్‌నాయక్

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 17: కొవిడ్‌ మహామ్మారిని ఎదుర్కోవడం మన చేతులోనే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ (సంచాలకులు) అమర్‌సింగ్‌ నాయక్‌ అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం సుభాష్‌నగర్‌లోని సిరిసిల్ల పంక్షన్‌ హాల్‌లో సిరిసిల్ల ము న్సిపల్‌ ఆధ్వర్యంలో  కొవిడ్‌- 19 వాక్సిన్‌. రెండో దశ వైరస్‌ ప్రబల కుండా తీసుకునే జాగ్రత్తలపై డీఎంహెచ్‌వో, రెవెన్యూ, పోలీస్‌ డిపార్ట్‌మెంట్ల అధికారులు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ అమర్‌ సింగ్‌నాయక్‌ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైరస్‌ బారిన పడిన వారికి వెద్యం అందించడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుందన్నారు. ప్రజలు వాక్సిన్లపై అపోహహలు పడవద్దని చెప్పారు. కొవాక్సిన్‌, షీల్డ్‌ వాక్సిన్‌లలో ఏదీ వేసుకున్న 96 శాతం రెండూ పనిచేస్తున్నాయన్నారు. మొదటి డోస్‌ ఏ వ్యాక్సిన్‌ తీసుకుంటే రెండో డోస్‌ కూడా అదే తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 42 సబ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి వాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళచక్రపాణి మాట్లాడుతూ కొవిడ్‌- 19 వైరస్‌ వ్యాపించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తేనే నియంత్రించడం సాధ్యం అవుతుందన్నారు.  సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రజలు వాక్సిన్‌లపై అపోహలు వీడే విధంగా ప్రజలతో మమేకమై ఉండే కౌన్సిలర్లు అవ టాహన కల్పించాలన్నారు.  మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం పట్టణంలో మాస్కులు ధరించని వారికి మున్సి పల్‌ సిబ్బంది జరిమానాలు విధిస్తన్నారని చెప్పారు.  కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు, కొవిడ్‌- 19 జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌, ప్రోగ్రాం ఆఫీసర్లు అతుల్‌, జగన్నాథ్‌రెడ్డి, శ్రీరాములు, మీనాక్షి, మున్సిపల్‌ టీపీవో అన్సారీ, సిబ్బంది పాల్గొన్నారు.


 ప్రణాళిక సిద్ధం చేయాలి..

కొవిడ్‌ - 19 వాక్సినేషన్‌ 100 శాతం పూర్తి చేయడం కోసం ప్ర ణాళిక సిద్ధం చేయాలని  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్ట ర్‌ అమర్‌సింగ్‌ నాయక్‌ అ న్నారు. శనివారం పట్టణంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ  వాక్సినేషన్‌ వేయడానికి ప్రణాళికను జిల్లా అధికారులు రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌  సుమన్‌ మోహన్‌రావు,  కొవిడ్‌ - 19 జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌, ప్రో గ్రాం ఆఫీసర్లు అతుల్‌, జగన్నాథ్‌రెడ్డి, శ్రీరాములు, మీనాక్షి, మహేష్‌, కపిలసాయి, అనిల్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T05:14:30+05:30 IST