మద్యం సేవించి ఆఫీస్‌కు వెళ్లి ఉద్యోగం పోగొట్టుకున్న మహిళా ఉద్యోగి.. కోర్టు తీర్పుతో ఆమెకు లక్షలు..

ABN , First Publish Date - 2021-09-17T17:07:46+05:30 IST

మద్యం సేవించి విధులకు హాజరుకావడం ప్రమాదకరం. అలాంటి ఉద్యోగిని ఏ సంస్థా సహించదు.

మద్యం సేవించి ఆఫీస్‌కు వెళ్లి ఉద్యోగం పోగొట్టుకున్న మహిళా ఉద్యోగి.. కోర్టు తీర్పుతో ఆమెకు లక్షలు..

మద్యం సేవించి విధులకు హాజరుకావడం ప్రమాదకరం. అలాంటి ఉద్యోగిని ఏ సంస్థా సహించదు. మద్యం సేవించి ఆఫీస్‌కు వచ్చినట్టు తెలిస్తే వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేస్తుంది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఉన్న ఓ సీ ఫుడ్ సంస్థ కూడా అదే పని చేసింది. దీంతో బాధిత ఉద్యోగి కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయమూర్తులు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఉద్యోగంలో నుంచి తీసేసినందుకు సదరు మహిళకు 5.5 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కంపెనీనీ ఆదేశించారు. 



మాల్గోర్జాటా క్రోలిక్ అనే మహిళ ఎడిన్‌బర్గ్‌లో ఉన్న ఓ సీ ఫుడ్ సంస్థలో 11 ఏళ్లుగా పనిచేస్తోంది. సోమవారం మధ్యాహ్నం డ్యూటీకి వచ్చినపుడు ఆమె దగ్గర్నుంచి ఆల్కహాల్ వాసన వచ్చింది. దీంతో సిబ్బంది మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఎదుట క్రోలిక్ తను మద్యం సేవించినట్టు అంగీకరించింది. అయితే తన 2 గంటల షిఫ్ట్‌కు 9 గంటల ముందు.. ఉదయం 5 గంటలకు 3 బీర్లు తాగినట్టు చెప్పింది. దీంతో కంపెనీ పాలసీ ప్రకారం ఆమెను ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగించారు. 


ఇవి కూడా చదవండి

ఛీఛీ.. వాడసలు మనిషేనా? సూపర్ మార్కెట్‌ ఫ్రీజర్ డోర్ తీసిన మహిళకు షాక్..




నా భార్యకు పుట్టిన బిడ్డకు నేను తండ్రిని కాదు.. కోర్టుకెక్కిన ఓ భర్త.. అసలు శారీరకంగానే కలవలేదంటూ షాకింగ్ నిజాలు..


కంపెనీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తన షిఫ్టుకు 9 గంటల ముందు మద్యం సేవించడం తప్పు కాదని కోర్టు అభిప్రాయపడింది. రాత్రి 12 గంటలకు మద్యం సేవించి తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు విధులకు హాజరయ్యే వ్యక్తి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. క్రోలిక్ విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాలని సూచించింది. 11 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న మహిళ పట్ల యాజమాన్య అవమానకరంగా ప్రవర్తించిందని పేర్కొంటూ, సంస్థ ఆమెకు 5000 యూరోలు (దాదాపు రూ5.5 లక్షలు) నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. 

Updated Date - 2021-09-17T17:07:46+05:30 IST