KBR Park వద్ద సినీ నటిపై దాడి.. : ఆ రోజు రాత్రి 8.30 గంటలకు అసలేం జరిగింది.. Diamond ring, Phone Pe కథేంటి.. లైంగికంగా దాడికి ప్రయత్నించాడా.. ఆ ఐదడుగుల వ్యక్తి ఎవరు..!?

ABN , First Publish Date - 2021-11-18T12:42:03+05:30 IST

KBR Park వద్ద సినీ నటిపై దాడి.. : ఆ రోజు రాత్రి 8.30 గంటలకు అసలేం జరిగింది.. Diamond ring, Phone Pe కథేంటి.. లైంగికంగా దాడికి ప్రయత్నించాడా.. ఆ ఐదడుగుల వ్యక్తి ఎవరు..!?

KBR Park వద్ద సినీ నటిపై దాడి.. : ఆ రోజు రాత్రి 8.30 గంటలకు అసలేం జరిగింది.. Diamond ring, Phone Pe కథేంటి.. లైంగికంగా దాడికి ప్రయత్నించాడా.. ఆ ఐదడుగుల వ్యక్తి ఎవరు..!?

  • చంపాలని చూశాడు..
  • చీకట్లోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టాడు
  • తప్పించుకొని పారిపోయా..
  • చూస్తే గుర్తుపడతా..
  • మీడియాతో సినీనటి శాలు చౌరాసియా

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ఆంగతుకుడు తనపై పథకం ప్రకారమే దాడి చేశాడని సినీనటి శాలు చౌరాసియా అన్నారు. బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద దాడి అనంతరం ఆమె కొండాపూర్‌లో మీడియా ముందుకు వచ్చారు. నాటి ఘటన వివరాలు ఆమె మాటాల్లోనే.. ‘‘నేను రోజూ వాకింగ్‌ చేసేందుకు కేబీఆర్‌ పార్క్‌నకు వెళ్తాను. ఆ రోజు కూడా సాయంత్రం ఆరు గంటలకు వెళ్లారు. ప్రధాన గేటు వద్దకు రాగానే అమ్మ ఫోన్‌ చేసింది. దీంతో వాకింగ్‌ కాస్త లేట్‌ అయింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నన్ను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. వాకర్‌ అనుకున్నా. చీకటి ఉన్న ప్రాంతం రాగా, ఆగంతుకుడు వెనుక నుంచి వచ్చి ముఖానికి వస్త్రం పెట్టాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా కింద పడేసి కొట్టాడు. మరింత చీకట్లోకి లాక్కెళ్లాడు. అరిచేందుకు ప్రయత్నించగా, తలను రాయికి  కొట్టాడు. రెండు చేతులు వెనక్కి మడిచి పట్టుకొని పైకి లేపాడు. నేను సహాయం కోసం అరిచాను. అరిచినప్పుడల్లా కొడుతూనే ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని హిందీలో డబ్బు కావాలా అని అడిగాను. వజ్రపు ఉంగరం ఇద్దామనుకున్నా. ఆగంతుకుడు తెలుగులో మాట్లాడాడు. ఫోన్‌ తీసి ఫోన్‌ పే చేస్తానంటూ డయల్‌ 100కు కాల్‌ చేసి కట్‌ చేశాను’’ అని శాలు చెప్పారు.


నిన్ను చంపేసి.. తగుల బెడతా..!

’’రెండోసారి కూడా కాల్‌ చేయడంతో అనుమానం వచ్చి ఫోన్‌ లాక్కున్నాడు. విచక్షణారహితంగా కొట్టాడు. బండరాయికి తల బాదడంతో స్పృహ తప్పినంత పని అయింది. అపస్మారక స్థితికి వెళ్లినట్లు అనిపించింది. లైంగికంగా దాడికి ప్రయత్నించినట్లు అర్ధం అయింది. ఆగంతుకుడు అక్కడే ఉన్న పెద్ద బండరాయి తీసి, ‘నిన్ను చంపేసి.. తగుల బెడతా’ అంటూ రాయి విసిరాడు. అప్పటికే కదలలేని స్థితిలో ఉన్నాను. కష్టపడి పక్కకు జరిగాను. లేదంటే ఆ రాయికి బలి అయ్యేదాన్ని. తప్పించుకునేందుకు పరుగులు పెట్టాను. కాని కాలు సహకరించలేదు. కొద్ది దూరం వచ్చాక ప్రధాన రోడ్డు కనిపించింది. గేటు వరకు పరిగెడితే దొరికి పోతానని, ఫెన్సింగ్‌ దూకాలని భావించాను. రెండుసార్లు ప్రయత్నించాను. పక్కనే ఉన్న కొండలాంటి దాన్ని ఎక్కి, మొత్తం మీద ఫెన్సింగ్‌ ఎక్కాను. సహాయం కోసం అరిచాను.  దీంతో నా సెల్‌ఫోన్‌తో పారిపోయాడు. మెల్లిగా ఫెన్సింగ్‌ దిగి అరవడంతో అక్కడే ఉన్న వ్యక్తి, ఎదురుగా ఉన్న స్టార్‌బక్స్‌ వద్ద ఉన్న డ్రైవర్లు వచ్చారు. వారి ఫోన్‌ నుంచే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాను. తెలంగాణ పోలీసులు వెంటనే స్పందించారు. ఆగంతుకుడు ఐదు అడుగుల ఎత్తులో ఉంటాడు. మరోసారి చూస్తే తప్పకుండా గుర్తు పడతానని’’  అన్నారు.


కాగా.. నిందితుడు కాలి నడకనే వచ్చినట్లు తెలుస్తోంది. తెలిసిన వారి పనే అనుకుని నటి స్నేహితులను పోలీసులు ప్రశ్నించారు. సంఘటన జరిగిన రోజు రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఆమె చెప్పిన పోలికలున్న వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఎల్‌ అండ్‌ టీ ఏర్పాటు చేసిన కెమెరాలతోపాటు కేబీఆర్‌ చుట్టూ ఉన్న వ్యాపార సముదాయాల కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే, నటి సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2021-11-18T12:42:03+05:30 IST