చాణక్య నీతి: ఆచార్య చాణక్య జీవితంలో చాలామందికి తెలియని ఆసక్తికర ఘటనలు.. తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

ABN , First Publish Date - 2022-01-03T12:35:22+05:30 IST

ఆచార్య చాణక్యుని జీవితానికి సంబంధించిన..

చాణక్య నీతి: ఆచార్య చాణక్య జీవితంలో చాలామందికి తెలియని ఆసక్తికర ఘటనలు.. తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

ఆచార్య చాణక్యుని జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర ఘటనల గురించి చాలామందికి తెలియదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్య జన్మించిన సమయంలో అతని నోటిలో ఒక దంతం ఉంది. ఒక జైన సన్యాసి.. చాణక్యుని చూసి, ఈ పిల్లవాడు భవిష్యత్‌లో రాజు అవుతాడని చెప్పారు. ఈ మాట విన్న చాణక్యుని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. తాను వెళ్లాక.. చాణక్యుని దంతాన్ని మీరుగానీ తొలగిస్తే, అతను రాజు అయ్యే వ్యక్తిని తీర్చిదిద్దుతాడని ఆ జైన సన్యాసి తెలిపారు. ఆచార్యను కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా అంటారు. చాణక్యుని అసలు పేరు విష్ణుగుప్త అని కూడా చెబుతారు. శ్రీ చాణక్‌కు కుమారుడు కావడంతో చాణక్యుడు అనే పేరు వచ్చిందని అంటారు.


దౌత్యం, ఆర్థికశాస్త్రం, రాజకీయ వ్యూహాలతో ముడిపడిన ప్రవచనాలను చేసిన గొప్ప పండితుడు కావడంతో చాణక్యుడిని కౌటిల్య అని పిలుస్తారు. తండ్రి మరణం తరువాత ఆచార్య చాణక్యుని సామర్ధ్యాలను పండితుడైన రాధా మోహన్ పసిగట్టారు. వెంటనే చాణక్యుడిని తక్షశిల విశ్వవిద్యాలయంలో చేర్పించారు. అది మొదలు చాణక్యుని జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అక్కడ విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆచార్య చాణక్య అదే విశ్వవిద్యాలయంలో బోధన సాగిస్తూ, అనేక గ్రంథాలను కూడా రచించారు. ఆచార్య చాణక్య.. రాజు చంద్రగుప్తునికి ఆహారంలో ప్రతిరోజూ కొద్ది మోతాదులో విషాన్ని ఇచ్చేవాడని చెబుతారు. భవిష్యత్తులో ఎప్పుడైనా చంద్రగుప్తుడు.. శత్రువు చేసే విషపూరితమైన దాడికి గురైతే, దానిని సులభంగా భరించగలుగుతాడని భావించిన చాణక్య  ఈ విధంగా మహారాజుకు విషం ఇచ్చేవారని అంటుంటారు. ఆచార్య చాణక్య మరణం గురించి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకరోజు ఆచార్య చాణక్య తన పనులన్నీ ముగించుకుని, రథంపై అడవిలోకి వెళ్లారని, ఆ తరువాత మరి తిరిగి రాలేదని చెబుతారు. మరో కథనం ప్రకారం.. మగధ రాణి హెలెనా.. ఆచార్య చాణక్యకు విషం ఇచ్చి హత్యచేసిందని కూడా చెబుతుంటారు. 

Updated Date - 2022-01-03T12:35:22+05:30 IST